Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి టైటిల్ సాంగ్.. Roar of Kesari లిరికల్ వీడియో చూశారా?

‘భగవంత్’ కేసరి నుంచి తాజాగా థర్డ్ సింగిల్ ను విడుదల చేశారు. ఇప్పటికే వదిలిన రెండు సాంగ్స్ కు భిన్నంగా మూడో పాటను రిలీజ్ చేశారు. లిరికల్ వీడియో చాలా ఆకట్టుకుంటోంది.
 

Third Song Roar of Kesari out from Bhagavanth Kesari NSK
Author
First Published Oct 17, 2023, 10:33 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). రెండు రోజుల్లో ఈ మాస్ యాక్షన్ ఫిల్మ్ థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీలా కూతురు పాత్ర పోషించింది. నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ గా అలరించబోతున్నారు. థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. 

ఈక్రమంలో అటు ప్రెస్ మీట్, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో ఆకట్టుకుంటూనే వస్తున్నారు. మరోవైపు సినిమా కు సంబంధించిన అప్డేట్స్ ను కూడా  ఇంట్రెస్టింగ్ గా వదులుతున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ ను వదిలారు. గణపతిస్పెషల్, ఉయ్యాల ఉయ్యాల పాటు ఎంతబాగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక తాజాగా మూడో పాటను కూడా విడుదల చేశారు. Roar of Kesari అంటూ విడుదల రిలీజ్ చేసిన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది.

ఈ సాంగ్ టైటిల్ ట్రాక్ గా అర్థమవుతోంది. పాటలో ప్రధాన పాత్ర పవర్, యాక్షన్-ప్యాక్డ్ స్వభావాన్ని హైలైట్ చేసేలా రూపొందించారు. ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఎస్ థమన్ అద్భుతమైన కంపోజ్ అందించారు. ట్యూన్ అదిరిపోయింది. చాలా క్యాచీగా ఉండటంతో మంచి వ్యూస్ ను అందుకుంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios