Asianet News TeluguAsianet News Telugu

శ్రీలీలకి స్నేక్‌ డాన్సు వేయాలనిపించిన సాంగ్‌ ఏంటో తెలుసా?.. ఈ సారి ఊపేసిందట..

శ్రీలీల డాన్సులకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె మాస్‌ సాంగ్‌లకు వేసే డాన్సులు చాలా ఫేమస్‌. ఇప్పుడు `లీలమ్మో` పాటలో నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతున్నాయట. 

third song out from aadikeshava movie sreeleela dance hightlight arj
Author
First Published Oct 26, 2023, 12:16 AM IST

వైష్ణవ్‌ తేజ్‌, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం `ఆదికేశవ`. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈచిత్రం రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి `లీలమ్మో` అంటూ సాగే సినిమాలోని మూడో పాటని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అభిమానుల సమక్షంలో పాట విడుదలైంది. పాటకి మంచి స్పందన లభిస్తుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్  సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింద`న్నారు. 

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ, `ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా 'ఆదికేశవ' వస్తుంది. 'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. వైష్ణవ్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది. అంతా బాగుంటుంది ఈ పాట" అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ..సినిమా ప్రథమార్థం అంతా వైష్ణవ్, శ్రీలీల, సుదర్శన్ తో ఎంతో సరదాగా సాగిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుందని చెప్పారు. 'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు 'ఆదికేశవ' అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారని నిర్మాతలు తెలిపారు.

`అందం, అభినయం, నాట్యంతో అలరిస్తున్న శ్రీలీల పేరుతోనే 'లీలమ్మో' పాట సాగడం విశేషం. ఈ పాటతో పూర్తి మాస్ ట్రీట్ ఇవ్వాలని `ఆదికేశవ` టీమ్ నిర్ణయించింది. డ్యాన్స్ మూవ్‌మెంట్‌లు, నాయకానాయికల జోష్ 'లీలమ్మో' పాటను మాస్ మెచ్చే పాటగా మలిచాయి. ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు 'ఆదికేశవ' మరిన్ని అద్భుతమైన మాస్ మూమెంట్స్‌తో రాబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'సిత్తరాల సిత్రావతి', 'హే బుజ్జి బంగారం' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'లీలమ్మో' పాట అంతకుమించి ఉంది.

గీత రచయిత కాసర్ల శ్యామ్ తన మాస్ పదాలతో పాటను తప్పక వినేలా చేశారు. నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహాన్ అద్భుతమైన గాత్రంతో మాస్ లిరిక్స్‌కు ఎనర్జీని ఇచ్చారు. మాస్, ఎనర్జీ కలిసి ఈ పాటను మాస్ బ్లాస్ట్ గా మలిచాయి. పాటలు, ప్రోమోలు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు లీలమ్మో పాట ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు` అని టీమ్‌ తెలిపింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios