అగ్లీగా ఉన్నావు, మా పక్కన నిలబడొద్దు అని తోసేశారు : ప్రణవి

అగ్లీగా ఉన్నావు, మా పక్కన నిలబడొద్దు అని తోసేశారు : ప్రణవి

సినీ జీవితం అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ల బాధలు ఎవరికి తెలియదు. సింగర్  ప్రణవి కెరీర్‌ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డానని  తెలిపింది. అలీతో జాలీగా షోకు భర్తతో పాటు హాజరైన ప్రణవి, కెరీర్ తొలినాళ్లలో అనుభవించిన అవమానాన్ని గుర్తు చేసుకుంది. చాలా సార్లు తాను పాడిన పాటలను తీసేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. అలాగే వేరేవాళ్లు పాడిన పాటలను తనతో పాడించిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రణవి చెప్పింది. ఒకసారి అందరితో కలిసి పాడుతుంటే స్టేజ్‌ పై నుంచి తనను తోసేశారని చెప్పింది.

అప్పటికే రెండు మూడు సార్లు అవహేళనగా మాట్లాడారని, 'అగ్లీగా ఉన్నావు, మా పక్కన నిలబడొద్దు' అని ఎద్దేవా చేశారని కన్నీటి పర్యంతమైంది. దీంతో కసిగా ఇకపైన వీరు నా వెనుక నిలబడి పాడాలనే పట్టుదలతో ప్రయత్నించి, డిప్లొమా డిస్టింక్షన్‌ లో పాసయ్యానని తెలిపింది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుని సింగర్ గా నిరూపించుకున్నానని చెప్పింది. ఆ రోజు తనను అవమానించిన వారు ఇప్పుడు తన వెనుక వుండి పాడుతున్నారని గర్వంగా చెప్పింది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos