Asianet News TeluguAsianet News Telugu

‘వాల్తేరు వీరయ్య’రివ్యూ రేటింగ్స్ పై చిరు వ్యంగ్యంగా కామెంట్

ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రం హిట్ తో చిరంజీవి మంచి ఉషారుగా ఉన్నారు. ఆయన ఈ చిత్రం యుఎస్ రివ్యూలపై కామెంట్స్ చేసారు.

They have given 2.25 ratings to our film from US Premieres: Chiranjeevi
Author
First Published Jan 23, 2023, 10:23 AM IST


 మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేసారు. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ అందుకుంది. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చింది. చిరు లుక్ కు.. ఆయన మాస్‌ యాక్టింగ్‌కు ఈలలు పడ్డాయి. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. వింటేజ్ వీరయ్యగా అభిమానులను అలరిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రం హిట్ తో చిరంజీవి మంచి ఉషారుగా ఉన్నారు. ఆయన ఈ చిత్రం యుఎస్ రివ్యూలపై కామెంట్స్ చేసారు.

చిరంజీవి మాట్లాడుతూ...‘వాల్తేరు వీరయ్య’  US ప్రీమియర్ రివ్యూ రేటింగ్ లు 2.25 ఇచ్చారని..అయితే తాను వాటిని తప్పుగా అర్దం చేసుకున్నానని, వాటి అర్దం USలో వచ్చే కలెక్షన్స్ గురించి అని ఇప్పుడు తెలుస్తోందని సెటైర్ వేసారు.USA ($2.25M USD) లో అదే సేమ్ ఫిగర్ కలెక్ట్ చేసిందని అన్నారు. ఇది విన్న అభిమానులు ఉత్సాహంతో విజిల్స్ వేసారు.

 ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే... ఈ సినిమా 9 రోజులకు  తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూల్ చేసిందంటే.. మొదటి రోజు 22.9 కోట్లు, రెండో రోజు-11.95 కోట్లు, మూడో రోజు-12.61 కోట్లు, నాలుగో రోజు-11.42 కోట్లు, ఐదో రోజు- 8.8 కోట్లు,6వ రోజు – 7.33 కోట్లు, 7వ రోజు -4.85 కోట్లు, 8వ రోజు-3.85 కోట్లు, 9వ రోజు-4.66 కోట్లు, టోటల్ గా ఇప్పటి వరకు 88.37 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా. అలాగే వాల్తేరు వీరయ్య 9 రోజుల ఇండియా వైడ్  కలెక్షన్  131.05 కోట్లు,9 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్  178.40 కోట్లు, 9 రోజుల ఓవర్సీస్ కలెక్షన్  25.00 కోట్లు, 9 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్ 153.40కోట్లు వచ్చాయి.
 
ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన సంగీతం, ఇచ్చిన పాటలు హైలెట్ అయ్యాయి. మాస్ సాంగ్స్‌తో ఊపు ఊపేసాడు.   ఈ సారి సంక్రాంతికి మైత్రి మూవీస్ పోటీ పడ్డాయి. ఇటు చిరంజీవి, అటు బాలయ్య సినిమాలతో మైత్రీ మూవీస్ సందడి చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios