గత వారం కింగ్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అని కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు. శనివారం కంటెస్టెంట్ కరాటే కల్యాణిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్, ఆదివారం పెద్ద హైడ్రామా మధ్య హారికను చివరి నిమిషంలో ఎలిమినేషన్ లేదని చెప్పి సర్ప్రైజ్ చేశారు. డబుల్ ఎలిమినేషన్  అని  చెప్పినప్పటికీ ఒక్కరినే గత వారం ఇంటి నుండి పంపించడం జరిగింది. 

ఐతే అనూహ్యంగా ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారానికి ఎలిమినేషన్ లిస్ట్ లో దేవి నాగవల్లి, హారిక, ఆరియానా, మోనాల్, మెహబూబ్, కుమార్ సాయి, లాస్య ఉన్నారు. ఈ ఏడుగురు నుండి దేవి నాగవల్లి, మెహబూబ్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారట. 

నామినేట్ కాబడిన ఏడుగురిలో తక్కువ ఓట్లు దక్కించుకున్న దేవి నాగవల్లి, మెహ బాబబూబ్ ఈ వారం ఎలిమినేట్ కానున్నారట. నేడు దేవి నాగవల్లి హౌస్ నుండి వీడనుందట. మరికాపట్లో ఈ విషయం తేలిపోనుంది.