దీపావళికి హీరోల సర్ప్రైజ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Nov 2018, 4:11 PM IST
These Three First Looks Will Come On Diwali
Highlights

పండగల సమయంలో హీరోలు తాము నటించే సినిమాలను విడుదల చేయడం లేకపోతే సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ అంటూ అప్ డేట్స్ తో సందడి చేస్తుంటారు. ఈ దీపావళికి ముగ్గురు హీరోలు తన సినిమాల ఫస్ట్ లుక్ లను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. 

పండగల సమయంలో హీరోలు తాము నటించే సినిమాలను విడుదల చేయడం లేకపోతే సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ అంటూ అప్ డేట్స్ తో సందడి చేస్తుంటారు. ఈ దీపావళికి ముగ్గురు హీరోలు తన సినిమాల ఫస్ట్ లుక్ లను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ముందుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నాడు. ఈ సినిమా 'వినయ విదేయ రామ' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మరి ఏ టైటిల్ ని ఫైనల్ చేయనున్నారో.. దీపావళి రోజు తెలియనుంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దగ్గుబాటి వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న 'ఎఫ్2' సినిమా టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ కూడా తన సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గుహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్స్ ని వెల్లడించలేదు. దీపావళి నుండి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.
 

loader