ఈ వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.. గుడ్ బ్యాడ్ అగ్లీ, శుభం, సింగిల్ వీటిలో ప్రధాన సినిమాలుగా అభిమానులను అలరించనున్నాయి.

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ సిద్ధంగా ఉంది. థియేటర్ కి వెళ్లే వారికి కొత్త సినిమాలు వుండగా, ఇంట్లోనే కూర్చొని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంజాయ్ చేయాలనుకునేవారికీ ఓటీటీలో పక్కా ట్రీట్ ఉంది.

థియోటర్లలో శుభం, సింగిల్

మొదట థియేటర్ల విషయానికి వస్తే... శ్రీ విష్ణు నటించిన సింగిల్ అనే సినిమా ఈ వారం విడుదలవుతోంది. ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. అలాగే సమంత నిర్మాతగా తీసిన మరో సినిమా శుభం కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తోంది. ఈ రెండు సినిమాలు ఓ కొత్త అటెంప్ట్‌తో ఉండబోతున్నాయన్న అంచనాలున్నాయి.

ఇంకా శ్రద్ధా శ్రీనాధ్‌ నటించిన కలియుగమ్-2064, నవీన్ చంద్ర నటించిన బ్లైండ్ స్పాట్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్లీ థియేటర్లలోకి రీ-రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను పెద్ద తెరపై మళ్లీ చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలో గుడ్ బ్యాడ్ అగ్లీ, హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్సిక్, లాస్ట్ బులెల్లెట్

ఇప్పుడు ఓటీటీల విషయానికి వస్తే, అక్కడ కూడా వారం మొత్తం ఫుల్ ప్యాక్‌గా ఉంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే తమిళ-తెలుగు మూవీ మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఇదే రోజు మరో ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్సిక్, మే 9న ది డిప్లొమ్యాట్, ది రాయల్స్ అనే వెబ్‌సిరీస్‌, మే 7న ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్ అనే సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

అదే విధంగా అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి హిందీలో గ్రామ్ చికిత్సాలయమ్ అనే సినిమా వస్తోంది. ఈటీవీ విన్‌లో మే 8న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రం స్ట్రీమింగ్‌కు వస్తుంది. దీని హీరో ప్రదీప్ కాగా, హీరోయిన్ దీపికా పిల్లి. జియోసినెమాలో మే 4 నుంచి స్టార్ వార్స్ యానిమేషన్, మే 5 నుంచి యువ క్రైమ్ ఫైల్స్ సినిమా, మే 9న పోకర్ ఫేస్ అనే వెబ్‌సిరీస్ స్ట్రీమ్ కానున్నాయి.

ఈ వారం థియేటర్‌కు వెళ్లాలనుకున్నవాళ్లకైనా, ఇంట్లో ఉండి ఓటీటీలో సినిమాలు చూడాలనుకునేవాళ్లకైనా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అంటున్నట్టే ఉంది.