ఇక మిగిలింది ఆ ఐదు సినిమాలే!

These five movies are 2017 years tollywood last hope
Highlights

2017 టాలివుడ్ ఆశలను వమ్ముచేయదుకదా! 

2017 ఏడాది మరికొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ ఏడాది చిన్నా పెద్దా మొత్తం కలుపుకుంటే 200 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయని తెలుస్తోంది. బాహుబలి2 వంటి ప్రపంచఖ్యాతి సాధించిన సినిమా విడుదలైంది ఈ ఏడాదే. ఎలాంటి అంచనాలు లేకుండా 'అర్జున్ రెడ్డి' అంటూ ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం పడింది కూడా ఈ ఏడాదే. అయితే దసరా కానుకగా విడుదలైన రెండు భారీ చిత్రాలు స్పైడర్, జై లవకుశ మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. స్పైడర్ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక జైలవకుశ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సినిమాల విషయంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. 
దసరా నుండి గమనిస్తే గనుక దాదాపు విడుదలైన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాలు అందుకుంటూనే ఉన్నాయి. మెజారిటీ సినిమాలకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో ఓ ఐదు సినిమాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాని నటించిన 'ఎంసిఏ', అఖిల్ 'హలో' సినిమా, 'మాహానటి', 'ఎమ్మెల్యే', '2 కంట్రీస్'. ఇప్పుడు వరుస పెట్టి ఈ సినిమాలు విడుదలకానున్నాయి. ఈ ఐదు చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. వరుస పరాజయల మీదున్న సునీల్ సినిమా కూడా అంచనాలను పెంచుతోంది. ఎందుకంటే మలయాళంలో హిట్టయిన సినిమాకు రీమేక్ గా '2 కంట్రీస్' ను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ ఏడాది చివర్లో వస్తోన్న ఈ సినిమాలు ఏ మేరకు సత్తా చాటుతాయో చూడాలి!

loader