టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటాడనుకున్న అవినాష్ నిన్న అనూహ్యంగా ఎలిమినేటై వెళ్ళిపోయాడు. ఎలిమినేషన్స్ లో ఉన్న ఐదుగురు సభ్యుల్లో తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా అవినాష్ హౌస్ ని వీడడం జరిగింది. కమెడియన్ గా హౌస్ లో నవ్వులు పూయించిన అవినాష్, వెళుతూ వెళుతూ కూడా ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు కామెడీ పంచారు. ఇంటి సభ్యులను ఇమిటేట్ చేసి చూపించి కడుపుబ్బా నవ్వించాడు. అవినాష్ ఎలిమినేషన్ తో ఇంటిలో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. 

అభిజిత్, సోహైల్, హారిక, అరియనా, మోనాల్ మరియు అఖిల్ ఇంటిలో కొనసాగుతున్నారు. ఈ ఆరుగురి సభ్యులలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ నేరుగా ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. కాగా ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెడతాడు. ఐతే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉంది వీళ్ళే అంటూ ఓ లిస్ట్ బయటికి వచ్చింది. లీకైన ఈ సమాచారం ప్రకారం అఖిల్ మినహాయించి మిగతా ఐదుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారట. 

టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ కి వెళ్లిన అఖిల్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందగా... అభిజిత్, హారిక, మోనాల్, అరియనా మరియు సోహైల్ కూడా నామినేట్ అయ్యాడట.ఈ ఐదుగురిలో వచ్చే ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన నలుగురు టాప్ ఫైవ్ కి అర్హత సంపాదించి ఫైనల్ కి వెళతారు. ఈ ఐదుగురు సభ్యుల నుండి ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ గా టైటిల్స్ అందుకోవడం జరుగుతుంది. మరో రెండు వారాలలో బిగ్ బాస్ ముగయనున్న సంగతి తెలిసిందే...