పీపుల్స్ స్టార్, నిరాడంబరుడు మరియు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి కరోనా వ్యాప్తి వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని, వేగంగా వ్యాప్తి చెందుతున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని అన్నారు. కరోనా రెండోసారి కబళిస్తుందనేది ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్ధల కుట్రగా ఆయన అభివర్ణించారు. కరోనా వ్యాపిస్తుందని చెప్పడం ద్వారా శానిటైజర్స్, మాస్కులు, మెడిసిన్ అమ్మకాలు పెంచుకోవడానికి ఎత్తుగడ వేస్తున్నారని ఆయన అన్నారు. 

కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసమే ఈ ప్రచారం తప్పితే కరోనా వ్యాప్తి అనేది లేదని ఆయన తెలిపారు. కరోనా వైరస్, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా పేదవారు మాత్రమే నష్టపోయారు అన్నారు. ఆదానీ, అంబానీ లాంటి వాళ్ళు వేలకోట్లు సంపాదించుకున్నట్లు ఆర్ నారాయణమూర్తి చెప్పడం విశేషం. 
అలాగే వైజాగ్ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా ఆర్ నారాయణమూర్తి తప్పుబట్టారు. 

ఎందరో త్యాగఫలం వల్ల సంక్రమించిన వైజాగ్ స్టీల్ పరిశ్రమను ప్రయివేటీకరణ చేయడం దారుణం అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతున్న కేంద్రం.. పంచభూతాలను కూడా అమ్మేసేలా ఉందని అన్నారు. రైతులు మరియు వైజాగ్ స్టీల్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలకాలని ఆయన కోరారు.