`థీమ్ ఆఫ్ బ్రో` రిలీజ్.. థియేటర్లో ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే..
పవన్ కళ్యాణ్ నటించిన `బ్రో` సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. దీంతో ఇప్పటికే పవర్ స్టార్ మానియా ప్రారంభమైంది. ఆ వైబ్స్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫ్యాన్స్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది యూనిట్.

పవన్ కళ్యాన్ మానియా ప్రారంభమైంది. ఆయన నటించిన `బ్రో` మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. సాయిధరమ్ తేజ్ మరో ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. టీజర్, ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు. అవి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందనే క్లారిటీ ఇచ్చాయి.
తాజాగా సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిందియూనిట్. `బ్రో` థీమ్ సాంగ్‌ని విడుదల చేసింది. `థీమ్ ఆఫ్ బ్రో` పేరుతో ఈ పాటని విడుదల చేశారు. ఇది పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్‌లో వచ్చే పాటగా తెలుస్తుంది. ఆయన్ని ఎలివేట్ చేసేలా ఈ పాట సాగుతుందని తెలుస్తుంది. సాహిత్యంతో కూడిన ఈ పాట ఆద్యంతం అలరిస్తుంది. వినసొంపుగా ఉంది. హై ఫీల్‌నిస్తుంది. ఇదే పవన్ ఎంట్రీ టైమ్‌లో థియేటర్లలో ఫ్యాన్స్ ని ఊపేస్తుందని చెప్పొచ్చు.
తాజాగా విడుదల చేసిన `థీమ్ ఆఫ్ బ్రో` లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటకి కర్తకర్మ క్రియ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కావడం విశేషం. పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా, అదితి భవరాజు, అనుదీప్, దామిని, హరిక నారాయన్, హరిని, రేవంత్ ఇలా టాలీవుడ్‌లోని యంగ్ సింగర్స్ అంతా కలిసి ఆలపించారు. ఇదొక బెస్ట్ థీమ్‌సాంగ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
ఇక పవన్ కళ్యాణ్, సాయితేజ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన `బ్రో` సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు మంగళవారం `బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తోపాటు త్రివిక్రమ్ కూడా ఈ ఈవెంట్‌కి హాజరు కానున్నారు. ఈ సినిమాకి ఆయన మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఈవెంట్‌కి పవన్ స్నేహితుడు బండ్ల గణేష్ హాజరవుతారనే పుకారు వినిపించింది. కానీ అందులో నిజం లేదని సమాచారం.
ఇదిలా ఉంటే వర్షం `బ్రో` ఈవెంట్‌కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి పవన్ ఫ్యాన్స్ భారీగా హాజరు కానున్న నేపథ్యంలో వర్షం కారంగా ఇబ్బందులు తెలెత్తే ఛాన్స్ ఉంది. కానీ `భీమ్లా నాయక్` తర్వాత పవన్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీగానే వచ్చే అవకాశం ఉంది.