సినీ నటి భావన ఇంట్లో చోరీ

theft at actress bhavanas house
Highlights

భారీగా బంగారం, వెండి ఆభరణాల అపహరణ

చెన్నైలో సినీ నటి భావన ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో కి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 30 సవర్ల బంగారు నగలు, 20 కేజీల వెండి వస్తువులు దోచుకెళ్లారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్వాల్‌చావిడి నాట్టు పిళ్ళయార్‌ వీధిలో సుమన అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు నిఖిల్‌ అనే కుమారుడు, భావన అనే కుమార్తె ఉన్నారు. భావన పలు తమిళ సినిమాల్లో సహయనటిగా నటించారు.
 
ఈ నేపథ్యంలో గత నెల 20న హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహానికి భావన, ఆమె తల్లి, సోదరుడు వెళ్లారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వారు ఇంటికి తిరిగి రాగా తలుపులు పగులగొట్టి ఉండటాన్ని చూసి దిగ్ర్భాంతి చెందారు. ఇంటిలో బీరువాలన్నీ తెరచి వస్తువు లన్నీ చెల్లాచెదురుగా పడి ఉంది. దీంతో భావన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇంటిలోని కప్‌బోర్డులో దాచి న 30 సవర్ల బంగారు నగలు, 20 కేజీల వెండి వస్తు వులతోపాటు రూ.2 లక్షల విలువైన వజ్రాల హారం చోరీకి గురైనట్లు కనుగొన్నారు. కొత్వాల్‌చావిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని నటి భావన బంధువులు, ఇంటి పనిమనుషుల వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.

loader