Asianet News TeluguAsianet News Telugu

వచ్చే నెలలో థియేటర్లు బంద్ చేయనున్నారా..?

వచ్చే నెల మార్చి మొత్తం థియేటర్లు బంద్ చేయాలని థియేటర్ల యాజమాన్యం భావిస్తోందని టాక్. సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు ఆ నలుగురు చేతుల్లోనే ఉంటాయని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 

theatres bandh from march
Author
Hyderabad, First Published Feb 19, 2019, 1:45 PM IST

వచ్చే నెల మార్చి మొత్తం థియేటర్లు బంద్ చేయాలని థియేటర్ల యాజమాన్యం భావిస్తోందని టాక్. సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు ఆ నలుగురు చేతుల్లోనే ఉంటాయని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పరిస్థితి మరో విధంగా ఉందట. థియేటర్లు లీజుకు తీసుకుంటున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని సమాచారం.

గతంలో సురేష్ బాబు, ఎన్వీ ప్రసాద్ లు నిర్వహించిన థియేటర్లతో పోలిస్తే ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆ సంఖ్యని ఇంకా తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఎక్కడైతే థియేటర్లు వర్కవుట్ అవుతున్నాయో.. అవి మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటిని వదిలించుకోవాలని చూస్తున్నారు. గత  కొంతకాలంలో టాలీవుడ్ లో సరైన సినిమాలు లేకపోవడంతో థియేటర్లు రన్ చేయడం కష్టంగా మారింది.

సంక్రాంతికి తప్ప దానికి ముందు తరువాత కూడా థియేటర్లలో సరైన సినిమాలు లేక పరిస్థితి దారుణంగా మారింది. నైజాంలో పార్కింగ్ ఫీజులను తెలంగాణా ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ ఆదాయం కూడా పడిపోయింది. దీంతో మార్చిలో థియేటర్లు బంద్ చేయాలని నైజాం థియేటర్ల ఓనర్లు, లీజుకు తీసుకున్నవారు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రలో కూడా కొన్ని చోట్ల కలెక్షన్లు లేక షోలను రద్దు చేస్తున్నారు. అయితే అక్కడ బంద్ ఆలోచన లేనట్లు తెలుస్తోంది. నైజాంలో మాత్రం మార్చి నెలలో థియేటర్లు బంద్ చేసి.. పార్కింగ్ ఫీజులు డిమాండ్ చేస్తూ సమ్మెకి దిగబోతున్నారని సమాచారం. మరి ఈ వ్యవహారం దేనికి దారి తీస్తుందో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios