మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి థియేటర్ల ఓపెన్‌కి, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
తెలంగాణలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లకి అనుమతినిచ్చింది. తాజాగా దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ అనుమతితో ఇక థియేటర్లని ఓపెన్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి(ఆదివారం) థియేటర్లు ఓపెన్ చేయాలని, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
తెలంగాణ అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలంగాణ ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.
