Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవిపై చేయివేసిన కుర్ర హీరో... మెగాస్టార్ చేసిన పనికి అంతా షాక్...

మెగాస్టార్ తో ఫోటోలుదిగుతూ.. ఆయపై చేయి వేశాడు ఓ కుర్ర హీరో.. దాంతో వెంటనే చిరంజీవి అసిస్టెంట్ చేయి తీసి పక్కకునెట్టాడు.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా..? 

The young hero laid hands on Megastar Chiranjeevi.. What happened after that JMS
Author
First Published Aug 21, 2024, 10:49 AM IST | Last Updated Aug 21, 2024, 10:49 AM IST

మెగాస్టార్ చిరంజీవితో ఫోటో దిగడం అంటే క్రేజీగా ఫీల్ అవుతుంటారు ప్యాన్స్.. సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా చిరంజీవితో ఫోటో అంటే ఆరాటపడుతుంటారు. చిన్న చిన్న హీరోలు.. అప్పుడే ఎదుగుతున్న స్టార్స అయితే.. చిరుతో ఎగబడి ఫోటోలు తీసుకుంటుంటారు. ఇక మెగాస్టార్ కూడా తన దగ్గరకు వచ్చిన ఫ్యాన్స్ కు చాలా ఓపికతో కలుస్తుంటారు.. వారితో మాట్లాడి.. కష్టసుఖాలు తెలుసుకుని.. వారినిసంతోష పెట్టి పంపిస్తుంటారు. వచ్చిన ఫ్యాన్స్ చిరును ఇబ్బందిపెట్టకుండా.. సిబ్బంది ఎప్పటికప్పుడు కనిపెడుతుంటారు. ఈక్రమంలోనే తాజాగా ఓ సంఘటన జరిగింది. అదేంటంటే..? 

బాలయ్య నో అన్నాడు.. పవన్ కళ్యాణ్ కావాలన్నాడు.. ఏంటో తెలుసా..?

రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజయ్యింది..  భారీ విజయం కూడా సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్ కూడా చూసి బాగుందని మెచ్చుకున్నారు.. అంతే కాదు కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి ఇంటికి  పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు. అందరు కొత్త వాళ్లు కావడం.. మరికొంత మంది పాత వారు అయినా..  చాలా మంది నటులకు ఈ సినిమాతోనే గుర్తింపు రావడం.. చిరంజీవి అభినందించడంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. ఇక ఈ టీమ్ లో చాలామందికి చిరంజీవి  ఫేవరేట్ హీరో అవ్వడంతో... మెగాస్టార్ నుకలిసిన ఆనందంలో  ఎమోషనల్ అయ్యారు.

 

ఈ క్రమంలో ఈ మూవీ హీరోలలో ఒకరైన  యశ్వంత్ చిరంజీవి కోసం తెచ్చిన గిఫ్ట్స్ ని ఇచ్చి చిరంజీవి కాళ్ళకు నమస్కారం చసి  ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం చిరంజీవితో ఫోటో దిగడానికి యశ్వంత్ రాగా చిరు యశ్వంత్ పై చెయ్యి వేయగా యశ్వంత్ కూడా చిరంజీవి వెనుక నుంచి చెయ్యి వేసాడు. వెంటనే పక్కనే ఉన్న చిరంజీవి అసిస్టెంట్ యశ్వంత్ చెయ్యి తీసేసాడు. వెంటనే కంగారు పడ్డ యశ్వంత్.. చేయి తీసేసి కాస్త దూరంగా నిలుచున్నాడు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. 

ఇక వెంటనే మెగాస్టార్ స్పందించి వాళ్ళు అలాగే అంటారు నువ్వు వేసుకో అన్నారు. యశ్వంత్ పర్లేదు అంటూ దూరంగా ఉన్నా సరే చిరంజీవి ఒప్పుకోలేదు. యశ్వంత్ చెయ్యి తీసుకొని తన వెనుక వేసుకున్నారు. దీంతో ఈ  వీడియో వైరల్  అంవుతోంది. చిరంజివి ఎంత ఎదిగినా.. తన అభిమానులు దగ్గర ఒదిగే ఉంటారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నార, మెగాస్టార్ బంగారం అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. 

రానా వల్లే చదువుకోలేకపోయా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios