హీరో రామ్ ది వారియర్ మూవీపై గట్టి నమ్మకంతో ఉన్నట్లున్నాడు. కొన్ని ప్రధాన ఏరియా హక్కులను తానే తీసుకొని విడుదల చేస్తున్నాడట. మరి రామ్ అంతగా నమ్మడం వెనుక కారణం సినిమా విడుదలైతే కానీ తెలియదు.  


కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి(Lingu Swami)కి మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. రన్, పందెం కోడి లాంటి సినిమాలు ఆమెకు మంచి ఫేమ్ తెచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన పెద్దగా ఫార్మ్ లో లేరు. ఆయన గత రెండు చిత్రాలు అంజాన్, పందెంకోడి 2 అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ గత చిత్రాల ట్రాక్ మైండ్ లో పెట్టుకొని రామ్ ఆయనకు అవకాశం ఇచ్చాడు. రామ్ ఇమేజ్ కి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ది వారియర్ చిత్రాన్ని లింగు స్వామి తెరకెక్కించారు. రామ్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. 

ఇక జులై 14న ది వారియర్ (The Warriorr)తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కాగా ది వారియర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఏపీ లో రూ. 17 కోట్లకు రేషియో పద్దతిలో విక్రయించారట. నైజాంలో రూ. 13 కోట్లు ది వారియర్ హక్కులు పలికాయట. కాగా నైజాం హాక్కులతో పాటు వైజాగ్ హక్కులను రామ్ తీసుకున్నారట. రూ. 13 కోట్లకు స్రవంతి రవికిశోర్, రామ్ నైజాం హక్కులు తీసుకొని డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు దిల్ రాజుకు అప్పగించారట. 

ఇక నైజాం హక్కులను రూ. 4.32 కోట్లకు రామ్(Ram Pothineni) కొన్నారట. అంటే ది వారియర్ చిత్రంపై రూ. 17 కోట్లకు పైగా రామ్ పెట్టుబడి పెట్టారన్న మాట. ఈ మధ్య కాలంలో రామ్ చిత్రాల వసూళ్లను పరిశీలిస్తే ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే లాభాలు పంచింది. దాదాపు రూ. 34 కోట్ల షేర్ రాబట్టింది. ఆయన గత చిత్రం రెడ్ రూ. 19 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ లెక్కన రామ్ భారీ టార్గెట్ తో ఈసారి బాక్సాఫీస్ వద్ద అదృష్టం పరిశీలించుకోనున్నారు. తన ఇమేజ్ కి సంబంధం లేని కొత్త జోనర్ లో వస్తున్న వారియర్ ఫలితం రామ్ కి చాలా అవసరం. 

ఈ సినిమా విజయం సాధిస్తే ఆర్ధికంగా, ఇమేజ్ పరంగా డబుల్ రిజల్ట్స్ దక్కుతాయి. లేదంటే ఆయన బిగ్ షాక్ తినాల్సి ఉంటుంది. ది వారియర్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఆయన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ది వారియర్ అనంతరం రామ్ ఏకంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. అధికారికంగా పూజా కార్యక్రమాలు జరుగగా... త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.