ఉస్తాద్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది వారియర్’ .ఈ చిత్రం నిన్ననే థియేటర్లలోకి అడుగుపెట్టింది. తొలిరోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. 

టాలీవుడ్ స్టార్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘ది వారియర్’. ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత రామ్ ఎక్కువగా మాస్ కంటెంట్లతో నే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షనల్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ పోతినేని ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ The Warriorrలో నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

అయితే సినిమా రిలీజ్ కు ముందున్న భారీ హైప్ తొలిరోజున మ్యాచ్ చేయగలిగింది. ఆ తర్వాత మాత్రం కొన్నిచోట్ల మిక్డ్స్ టాక్ వినిపిస్తోంది. కానీ రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పెర్ఫామెన్స్ ను మెచ్చుకుంటున్నారు. దర్శకుడి ప్రతిభనూ ప్రశంసిస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం రామ్ పోతినేని వసూళ్ల పరిస్థితి తొలిరోజు అవరేజ్ గానే మొదలైంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా షేర్ వసూళ్లలో ‘ది వారియర్’ కేవలం రూ.8 కోట్ల మేరనే రాబట్టింది. మిగతా ఏరియాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇంకా వీకెండ్ రావాల్సి ఉండంతో వసూళ్లు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ది వారియర్ డే 1 ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ కలెక్షన్స్ ను (షేర్స్ లలో) ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో చూస్తే..

నైజాం : రూ. 1.95 కోట్లు
సీడెడ్ : రూ. 1.06 కోట్లు
యూఏ : రూ. 1.02 కోట్లు
తూర్పు : రూ. 51 లక్షలు
వెస్ట్ : రూ. 67 లక్షలు
గుంటూరు : రూ. 1.19 కోట్లు
కృష్ణా : రూ. 33 లక్షలు
నెల్లూరు :రూ. 29 లక్షలు
తెలంగాణ మరియు ఏపీ మొత్తం కలిపి రూ. 7.02 కోట్ల షేర్ ను (రూ.10.20 కోట్లు గ్రాస్) వసూల్ చేసింది.

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ది ఇండియా : రూ. 40 లక్షలు
ఓవర్సీస్ : రూ. 30 లక్షలు
తమిళనాడు : రూ. 30 లక్షలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.8.02 కోట్ల షేర్ ( రూ.12.20 కోట్లు ~ గ్రాస్) వచ్చింది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్రీ రిలీజ్ లెక్కల ప్రకారం కూడా ఈ మూవీ బ్రెక్ ఈవెన్ టార్గెట్ రూ.44 కోట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీకెండ్ లో ఉస్తాద్ రామ్ పోతినేని ఊపందనుకోనున్నట్టు తెలుస్తోంది. లింగుస్వామి దర్శకత్వం వహించగా, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. మూవీలో నదియా, అక్షర గౌడ, భారతిరాజా, చిరాగ్ జానీ, బ్రహ్మాజీ, జయప్రకాష్ పాత్రలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.