రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన మూవీ ‘డీజే టిల్లు’ (DJ Tillu). ఈ మూవీకి యూత్ లో మంచి రెస్సాన్స్ వస్తోంది. అటు కలెక్షన్లలోనూ డీజే టిట్లు మోత మోగిస్తున్నాడు. తాజాగా విడుదలైన డీజే టిల్లు ఫుల్ వీడియో సాంగ్ మిలియన్ వ్యూస్ కు చేరుకుంది.
సిద్థు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ DJ టిల్లు. ఈ మూవీ ఫిబ్రవరి 12 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విమల్ కృష్ణ కాని.. ఈసిమాకు కథ,స్క్రీన్ ప్లే అందించింది మాత్రం హీరో సిద్ధునే. ఈమూవీని ఓన్ చేసుకుని తన సినిమాగా దగ్గరుండి చూసుకున్నాడు సిద్ధు. సిద్దు సరసన హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) నటించింది. వీరిద్దరి కెమెస్ట్రీ ప్రస్తుతానికి ఆడియెన్స్ ను మెప్పితిస్తోంది.
డీజే టిల్లు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడానికి ఈ సినిమా ఒక ఎత్తైతే.. సాంగ్స్ మరో ఎత్తుగా చెప్పొచ్చు. ఇప్పటి ఈ మూవీస్ నుంచి ఇప్పటి వరకు త్రీ సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 6న ‘టిల్లు అన్న డీజే పెడితే’ టెటిట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కాగా ఇప్పటికీ ఈ సాంగ్ 40 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. టైటిల్ సాంగ్ కు ‘రామ్ మిర్యాల’(Ram Miryala) మ్యూజిక్, గాత్రం అందించగా ‘కాస్లర్ల శ్యామ్’ లిరిక్స్ సమకూర్చారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి మోతమోగుతూనే ఉంది.
మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్ అనిరుద్ తో పాడించిన సెకండ్ సింగిల్ ‘పటాస్ పిల్లా’ సాంగ్ ను జనవరి 24న రిలీజ్ చేశారు. నాలుగు మిలియన్ల వ్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న రిలీజైన ‘నువ్వలా’ సాంగ్ ను హీరో సిద్దునే స్వయంగా పాడిన పెద్దగా ట్రెండింగ్ లో లేదు. కానీ టైటిల్ సాంగ్ మాత్రం దూసుకెళ్తోంది.
ఆదిత్య మ్యూజిక్ గ్రూప్ తాజాగా విడుదల చేసిన ‘డీజే టిల్లు ఫుల్ వీడియో’ సాంగ్ కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను సాధించింది. మరోవైపు టైటిల్ లిరికల్ సాంగ్ 41 మిలియన్ వ్యూస్ తో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. టైటిల్ సాంగ్ వీడియోలో సిద్దు జొన్నలగడ్డ అటిట్యూడ్, ఎనర్జి లెవల్స్ ఆడియెన్స్ లో జోష్ పెంచుతున్నాయి.
