ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2) నుంచి ప్రస్తుతం ట్రైలర్ రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ మేరకు ట్రైలర్ ఈవెంట్ ను మేకర్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
మూడేండ్ల కింద కన్నడ పరిశ్రమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 (KGF 1) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ స్టార్ యాక్టర్ యష్ (Yash) ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయాడు. కన్నడతో పాటు, హిందీ, తమిళం, తెలుగు ఆడియెన్స్ కు రాఖీ భాయ్ గా గుర్తిండిపోయేలా చేశాడు. అయితే కేజీఎఫ్ 1 తర్వాత దానికి సీక్వెల్ గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందే చెప్పారు. అన్నట్టుగా ఈ చిత్రం రెండో భాగాన్ని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తుఫాన్’ (Toofan) సాంగ్ ను రిలీజ్ చేయగా.. అన్ని భాషల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.
KGF 2 భారీ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతున్నందున, మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ నిర్మాతలు ప్రమోషన్‌లను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మార్చి 27న బెంగళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహిస్తుండగా.. ఈవెంట్ కు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూర్, డైరెక్టర్ కరణ్ జోహార్ (Karan Johar) వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
.
మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva raj Kumar) ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ మేరకు హంబల్ ఫిల్మ్స్ తన ట్విట్టర్ లో అఫిషియల్ గా ప్రకటించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు శివరాజ్ కుమార్ హాజరవుతుండటం పట్ల వారికీ ఎక్సైట్ మెంట్ ఉందని పేర్కొన్నారు. మరోవైపు కన్నడ ప్రేక్షకులు కూడా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కన్నడ, తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14న KGF2 రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించారు. హంబల్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. కేజీఎఫ్ 2 నుంచి రిలీజ్ కానున్న ఈ ట్రైలర్.. చాలా పవర్ ఫుల్ విజువల్స్ తో కూడి ఉంటుందని తెలుస్తోంది. అలాగే సంజయ్ దత్ (Sanjay Datt) ఇంట్రడక్షన్ ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఫుల్ మాస్ ధమాకాతో కూడిన యాక్షన్, థ్రిల్, సస్సెన్స్ తో రానున్నట్టు తెలుస్తోంది.
