అమ్మ ప్రేమను కరెక్ట్ గా తెరపై చూపించగలిగితే ఎలాంటి సినిమానైనా బాక్స్ ఆఫీస్ ముందు రికార్డ్ లు బద్దలు కొడుతుందని KGF సినిమా నిరూపించింది. ప్రభాస్ కెరీర్ కి ఛత్రపతి ఎలాగో KGF యాష్ కి కూడా అదే తరహాలో విజయాన్ని ఇచ్చింది మథర్ సెంటిమెంట్. అయితే హీరో తల్లిగా కనిపించే నటీమణులు ఏ వవిధంగా కనిపిస్తారో అందరికి తెలిసిందే. 

కానీ KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచించిన విధానం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. అమ్మ పాత్ర కోసం ఒక యంగ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఒక ఎత్తైతే అమ్మ సెంటిమెంట్ మరొక ఎత్తు. KGFలో కనిపించిన అమ్మ పేరు అర్చన. నిండా 30 ఏళ్ళు కూడా లేని ఈ యువ నటికీ రీసెంట్ గా పెళ్లి అయ్యింది. 

సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన ఫొటోస్ ను జనాలు గట్టిగానే వెతుకుతున్నారు. కొన్ని ఫొటోస్ ని చూసి షాక్ అవుతున్నారు. అసలు ఆమె KGF లో నటించిన అమ్మాయేనా అని కామెంట్స్ చేస్తున్నారు. అప్పటివరకు రెండు సినిమాల్లో నటించిన అర్చన జాయిస్ KGF సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ అందుకుంది. సెకండ్ పార్ట్ లో కూడా అమ్మ సెంటిమెంట్ కి సంబందించిన సీన్స్ ఉంటాయట. KGF ఛాప్టర్ 2 వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ కష్టపడుతోంది.