నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'ది కాంజూరింగ్' సిరీస్ నుంచి తొమ్మిదవ భాగం స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతో మన ముందుకు వచ్చింది.  

హర్రర్ సినిమాలకు ప్రత్యేక మైన ప్యాన్స్. భయపడటాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తూంటారు. ముఖ్యంగా ‘కంజూరింగ్’ సీరిస్‌లో వచ్చే హర్రర్ సినిమాల అంటే వీరికి పిచ్చి. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కి భయపెట్టే ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ‘ద నన్’ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలో కూడా ఈ సినిమా కూడా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్లింది.

మళ్లీ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'ది కాంజూరింగ్' సిరీస్ నుంచి తొమ్మిదవ భాగం స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతో మన ముందుకు వచ్చింది. 'ది నన్ 2' అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం 2018లో వచ్చిన ది నన్ చిత్రానికి సీక్వెల్. ఫ్రాంఛైజీ ఉత్తమ చిత్రంగా నిలిచిన ది నన్ కి సీక్వెల్ ఇప్పుడు హారర్ జానర్ లో మరో సెన్సేషన్ అనవుతుంని ట్రైలర్ చూసిన వాళ్లంతా అంటున్నారు. ఆ ట్రైలర్ ని మీరు చూడండి. మొదటి నుంచి చవరిదాకా దడ పుట్టించే హారర్ సన్నివేశాలతో చిల్ అవ్వండి.

YouTube video player

ఈ ట్రైలర్ లో ... మరణించిన నన్ ... దెయ్యంగా మారాక కథను తిరిగి ఆవిష్కరిస్తున్నారు. 1956 కాలాని కి కథాంశాన్ని ముడిపెట్టి తెరకెక్కించారు. అక్కడ ఒక యువతి ఒక నన్ హత్యకు సాక్షిగా కనిపిస్తుంది. ఒక స్కూల్ లో ఒక ప్రీస్ట్ చనిపోవడం, దాన్ని ఒక అమ్మాయి చూస్తున్నట్లు చూపించారు. ఆ అమ్మాయికి ఆ స్కూల్ లో అన్నీ వింత వింతగా కనిపిస్తాయి. తర్వాత ఆమె దెయ్యం రూపంలో వచ్చిన నన్(సిస్టర్ ఐరీన్) ను చూసినట్టు చెబుతుంది. ఇక అక్కడ నుంచి వారిని ఆ నన్ భయపెడుతూ ఉంటుంది. ''ఇక్కడ ఏదో భయంకరమైనది ఉందని అనుకుంటున్నాను!'' అంటూ స్కూల్ విద్యార్థిని ట్రైలర్ లో మాట్లాడుతూండగానే అసలు భీభత్సం మొదలవుతుంది. అప్పుడు ఒక నన్ ఇలా అంటాడు. ''ఈ దయ్యం ఒకప్పుడు దేవదూత.. అయితే దేవుడు తిరస్కరించాడు'' అని వివరిస్తాడు.

 1956 లో ఫ్రాన్స్ లో ఒక నన్ ప్రీస్ట్ హత్యకు గురవుతుంది. ఆ తర్వాత దెయ్యంగా మారిన నన్ ప్రజల్ని భయపెడుతుంది. 'ది కాంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్'కి దర్శకత్వం వహించిన మైఖేల్ చావ్స్... ఇయాన్ గోల్డ్ బెర్గ్ & రిచర్డ్ నైంగ్ స్క్రీన్ ప్లేతో 'ది నన్ 2'కి పని చేసారు. ఈ చిత్రాన్ని రిచర్డ్ బ్రెనర్- డేవ్ న్యూస్టాడ్టర్- విక్టోరియా పాల్మెరి- గ్యారీ డాబర్ మాన్- మైఖేల్ క్లియర్- జడ్సన్ స్కాట్ - మైఖేల్ పోలైర్ నిర్మించారు.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ఆదాయాల లో 2 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన ది కాంజురింగ్ యూనివర్స్ హై సక్సెస్ ఫుల్ హర్రర్ ఫ్రాంచైజీల లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా $366 మిలియన్లను అధిగమించి ఫ్రాంచైజీ లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన చిత్రంగా 'ది నన్' అగ్రస్థానంలో ఉంది. సెప్టెంబర్ 8న 'ది నన్ 2' సినిమా థియేటర్లలో విడుదల కానుంది.