Asianet News TeluguAsianet News Telugu

సంచలన జీవో 111పై సినిమా..!

హైదరాబాద్‌లో శివారులో జీవో 11 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సురేష్‌ కొండేడి సమర్పణలో వై.రఘునాథరెడ్డి, స్నేహలత సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు.

the movie on sensational g o 111
Author
Hyderabad, First Published Aug 15, 2020, 10:16 AM IST

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జీవో 111. ఈ పేరు వింటేనే అందరికి హడల్‌. కొన్ని వర్గాల్లో భయాందోళనలను రేకెత్తించిన జీవో. ఈ రాజకీయ రాక్షస క్రీడలో వ్వవసాయ రైతులు బలవుతున్నారని తెలిపిన జీవో. పచ్చని పల్లెలు కాంక్రిట్‌ సౌధాలకు సమాధి అవుతున్నాయి. జీవోలని అడ్డుపెట్టుకుని నాయకులు, వారి తొత్తులు చేసే దురాగతాలపై ఓ యువకుడు తిరుగుబాటు ఫలితమే ఈ 111 జీవో. 

సమాజంలోని వాస్తవ పరిస్థితులకు, మృత్యమౌతున్న ప్రశాంత జీవిన బంధాలకు హృద్యమైన దృశ్యరూపమిది. ఇది ఏ ఒక్కరిదో కాదు, అందరి కథ. మనందరి వ్యథ. సజీవమైన వాస్తవ కథ. ప్రభుత్వ జీవోలు ప్రజల మెరుగైన జీవన విధానానికి బలమైన ఆయుధాలవ్వాలని చెప్పే ప్రయత్నమే ఈ చిత్రమని దర్శకుడి వీఆర్‌ అంటున్నారు. హైదరాబాద్‌లో శివారులో జీవో 11 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సురేష్‌ కొండేడి సమర్పణలో వై.రఘునాథరెడ్డి, స్నేహలత సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు. కమల్‌హాసన్‌ బ్యానర్లో తెరకెక్కుతుంది.

`విక్రమార్కుడు` లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సర్వేస్‌ మురారి దీనికి డీఓపీగా పనిచేస్తున్నారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు లీ మార్టి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ పాటలు రాస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్‌. `మంచి తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని, మంచి చిత్రాలను అందించాలనే సంకల్పంతో ఈ సినిమా నిర్మిస్తున్నామ`ని నిర్మాతలు తెలిపారు. తాజాగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios