‘అఖండ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య త్వరలో ‘ఎన్బీకే107’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా మూవీ టైటిల్ ను మేకర్స్ కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. 

నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎన్బీకే107’(NBK107). దర్శకుడు గోపీచంద్ మాలినేని డైరెక్ట్ చేస్తున్నారు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న యూనిట్ షూటింగ్ పార్ట్ ను తుది దశకు చేర్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా నుంచి అనధికారికంగా వస్తున్న అప్డేట్స్ కూడా మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో మూవీ ‘టైటిల్’ గురించి అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ అందింది.

బాలకృష్ణ సినిమా అంటేనే ఫ్యాన్స్ ముఖ్యంగా సాలిడ్ టైటిల్ ను ఆశిస్తుంటారు. దీంతో‘ఎన్బీకే107’ మూవీ టైటిల్ పైనా మొదటి నుంచి చర్చ జరుగుతోంది. తొలుత అన్నగారు, జై బాలయ్య వంటి టైటిళ్లను పరిశీలించారు. ఇక ఇటీవల మరో రెండు టైటిళ్లు ‘రెడ్డి గారు’,‘వీర నర్సింహారెడ్డి’పైనా చర్చించారు. ఇక ఫైనల్ గా ‘రెడ్డిగారు’ (Reddy Garu) టైటిల్ ను ఫైన్ చేసినట్టు సమాచారం. మూవీలోని పాత్రలు కూడా రెడ్డికి సంబంధించినవే కావడంతో కన్ఫమ్ చేశారంట. ఈ శనివారమే (అక్టోబర్ 15)న టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ పై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. అభిమానులు కూడా ఖుషీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే చిత్రం నుంచి టీజర్, పోస్టర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అప్డేట్స్ కు ఫ్యాన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడనుంది. దునియా విజయ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.