Asianet News TeluguAsianet News Telugu

యూత్ బేస్డ్ గా ‘ఆహా’లో సరికొత్త వెబ్ సిరీస్ ‘బీఎఫ్ఎఫ్’ .. మే 20 నుంచి స్ట్రీమింగ్

ఆడియెన్స్ మెచ్చే కంటెంట్ ను అందించడంలో ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ (Aha) ఎప్పుడూ ముందుంటోంది. ఇప్పటికే సక్సెస్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతున్న ‘ఆహా’.. తాజాగా సరికొత్త వెబ్ సిరీస్ ‘బీఎఫ్ఎఫ్’తో అలరించనుంది.

The latest web series called BFF in Aha,  Streaming from May 20
Author
Hyderabad, First Published May 13, 2022, 12:04 PM IST

ఆడియెన్స్ మనస్సుకు నచ్చే కంటెంట్ ను అందిస్తూ ‘ఆహా’ దూసుకెళ్తోంది. సరికొత్త సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఆహా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ తో   ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఒక సరికొత్త కథతో ‘బీఎఫ్ఎఫ్’ రూపంలో మనందరి ముందుకు ఆహా వేదికన రానుంది. ఆహా, డైస్ మీడియా అల్లుడు గారు తర్వాత ఈ వెబ్ సిరీస్ తో అందరిని అలరించడానికి సిద్ధమవుతున్నారు.

బీఎఫ్ఎఫ్ కథ.. ప్రసుత యువత ను దృష్టిలో పెట్టుకొని తీసినది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మంచి స్నేహం దొరకడం చాలా కష్టం. కానీ అలాంటి ఒక స్నేహం చెంతకి చేరినపుడు, జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందని సరదాగా అందరికి చూపిస్తుంది మన ఆహా. స్నేహం, బాధ్యతలు, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, కొత్త ఆఫీస్, కొత్త మనుషులు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు అద్దం పట్టినట్టు చూపించడానికి ఆహా, డైస్ మీడియా మరియు తమాడ ద్వారా మే 20 న మన ముందుకు వస్తుందీ వెబ్  సిరీస్.

కొత్త వెబ్ సిరీస్ గురించి ఆహా సీఈవో, అజిత్ కే ఠాకూర్ మాట్లాడుతూ "ఈ కథ యువతకు సంబంధించింది. వారి ఆలోచనల ప్రవాహమే ఈ బీఎఫ్ఎఫ్ అని తెలిపారు. ఈ కథ చూస్తున్నపుడు మన 20వ ఏటా జీవితం గుర్తుకొస్తుంది. ఇప్పటి యువతకు ప్రతిబింబమే ఈ వెబ్ సిరీస్. డైస్ మీడియా మరియు తమాడ ద్వారా ఈ వెబ్ సిరీస్ అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. 

కొత్తదనానికి మరో పేరైన ఆహా షోస్ ని లాంచ్ చేయడం లో తనకు తానే సాటి. ఈ సిరీస్ ని కూడా 12 మే నాడు మీడియా, తెలుగు సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్స్ మధ్యలో ఒక వాచ్ పార్టీ లో ఎయిర్ లైవ్, హైదరాబాద్ లో లాంచ్ చేసింది. ఈ వెబ్ సిరీస్ లో సిరి హనుమంత్, రమ్య పసుపులేటి తదితరులు నటించారు. మే 20 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఇప్పటికే సరికొత్త సినిమాలను అందిస్తున్న ఆహా ఇటీవల బాలక్రిష్ణ తో ‘అన్ స్టాపబుల్’ టాక్ షోను  సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన విషయం తెలిసిందే. ఈ షో ఓటీటీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు. అదే తరహాలో వెబ్ సిరీస్ లకూ మంచి ప్రాధాన్యతనిస్తోంది ఆహా సంస్థ.

 

Follow Us:
Download App:
  • android
  • ios