ఎన్ని వివాదాలు ఎదురైనా కేరళ స్టోరీ మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.

ఇప్పుడు ఎక్కడ విన్నా ది కేరళ స్టోరీస్ చిత్ర పేరే వినిపిస్తోంది. ఈ సంచలనాత్మక చిత్రం మే 5న పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన సంగతి తెలిసిందే. అనేక వివాదాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అదా శర్మ ఈ చిత్రంలో షాలిని ఉన్నికృష్ణన్ గా ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే టీజర్, ట్రైలర్ విడులయ్యాక కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ లేపింది. 

కేరళలో మహిళలని ట్రాప్ చేసి ముస్లింలు గా కన్వెర్ట్ చేసి ఆ తర్వాత బలవంతంగా ఉగ్రవాద సంస్థలకు తరలించే దారుణమైన చర్య చాలా కాలంగా జరుగుతోందనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇది ఒక ప్రాపగాండా చిత్రం మాత్రమే అని ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని కేరళ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

ఎన్ని వివాదాలు ఎదురైనా కేరళ స్టోరీ మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దీనితో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా విజయ యాత్ర చేపడుతున్నారు. ఇదిలా ఉండగా నేడు కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్, నటి అదా శర్మ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. 

Scroll to load tweet…

ముంబైలోని ఓ ప్రయివేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనితో అదా శర్మ, సుదీప్తో సేన్ ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే నేడు వీరిద్దరూ కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తా యాత్రకి హాజరు కావలసింది.

కానీ చికిత్స తీసుకుంటున్న కారణంగా తాను రాలేకపోతున్నానని సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ హిందూ ఏక్తా యాత్రకి మద్దతు తెలపాలని కోరారు. అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే వివరాలు బయటకి రాలేదు.