క్రితం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్‌లో 113 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది.
గత వారం రోజులుగా ఎక్కడ విన్నా ‘కశ్మీర్ ఫైల్స్’ ఫైల్స్ సినిమా గురించిన వార్తలే వినపడుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ‘కశ్మీర్ ఫైల్స్’ పేరిట ఆ సినిమాను థియేటర్లలోకి విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. కశ్మీర్ మారణహోమాన్ని తెరపై చూపించి కళ్లకు కట్టే ప్రయత్నం చేశారని అందరూ మెచ్చుకుంటున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండలను సినిమాలో చూపించారు. ఈ సినిమా అందరి నుంచి సినిమా ప్రశంసలను అందుకుంటోంది.సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ
ఇప్పటికే ప్రధాని మోదీ నుండి.. బీజేపీ నాయకులెందరో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని పొగుడుతూనే ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాకు కొన్ని రాష్ట్రాలు అయితే ఈ చిత్రానికి టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించాయి. ఇలా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటిటి కి రెడీ అవుతున్నట్లు సమాచారం. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను జీ5 సంస్థ విడుదలకు ముందే సొంతం చేసుకుంది.
అందుతున్న సమాచారం మేరకు.... మే నెలలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర టీమ్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 6న స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.
వాస్తవాల ఆధారంగా తెరకెక్కించారని చెబుతున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో పూర్తిగా అవాస్తవాలనే చూపించారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ‘‘1990లో కేంద్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉన్నట్లు చూపించారు. కానీ, ఆ సమయంలో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన ఉంది. అలాగే కేంద్రంలో భాజపా మద్దతు ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు మరణించిన, వలస వెళ్లిన వారిలో కశ్మీర్ పండిట్లే కాదు.. ముస్లింలు, సిక్కులు కూడా ఉన్నారు. వారెవరూ ఇప్పటికీ కశ్మీర్‌కు తిరిగి రాలేదు’’ అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్ పండిట్లను తిరిగి తీసుకొచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ తనవంతు ప్రయత్నం చేస్తోందని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిత్స్ కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ మరుణ కాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు చెప్తారు. ఇవన్నీ సినిమాలో చూపించారు. క్రితం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్‌లో 113 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది.
ఈ సినిమాలో మిథున చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ పల్లవి జోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ అగ్నిహోత్రి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.
