డ్రైవింగ్ స్కూల్ ని ప్రారంభించిన సల్మాన్ ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు డేరా బాబాతో పోలుస్తూ జోకులు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై జోకులు పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల సల్మాన్.. దుబాయిలో ఓ డ్రైవింగ్ స్కూల్ ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. అంతే.. ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారింది.

హిట్ అండ్ రన్ కేసులో చాలా సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగి మొదట దోషిగా తేలి.. ఆ తర్వాత నిర్దోషిగా సల్మాన్ బయట పడిన సంగతి తెలిసిందే. అయితే.. అలాాంటి సల్మాన్ తో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్.. తర్వాత హంటింగ్ స్కూల్ ప్రారంభిస్తాడేమో అని కొందరు కామెంట్ చేయగా,..డేరా బాబా.. నారీ నికేత్ ప్రారంభించడం.. సల్మాన్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించడం ఒకటే అని మరికొందరు కామెంట్ చేశారు.

మరికొందరేమో.. సల్మాన్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాడంటే.. డేరా బాబా గుర్మీత్ భవిష్యత్తులో మహిళ రక్షణ కేంద్రం ప్రారంభిస్తాడేమో అని ట్వీట్ చేశారు. మరి దీనిపై సల్మాన్ కానీ, బాలీవుడ్ ప్రముఖులు కానీ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. డ్రైవింగ్ స్కూల్ ప్రారంభ కార్య‌క్రమం కేవ‌లం కొద్ది మందితో ర‌హ‌స్యంగా జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఆ ఈవెంట్‌కు యూట్యూబ్ సెన్ష‌ష‌న్ ర‌షీద్ బెల్‌హ‌సా కూడా హాజ‌ర‌య్యాడు.