వాళ్లే.. ఆస్కార్ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చూడలేదా? క్లారిటీ ఇచ్చిన దర్శకురాలు కార్తీకి..
ఆస్కార్ అవార్డు పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ విషయంలో కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. వాటిపై దర్శకురాలు కార్తీకి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు బొమ్మను మరియు బెల్లీ సినిమా చూడలేదనే ఆరోపణలపై స్పందించారు.
‘ఆర్ఆర్ఆర్’ - ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’తో ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కాయి. దీంతో దేశవ్యాప్తంగా ఓ పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిష్టాత్మకమైన Oscar Awards ఇండియాకు దక్కడంతో భారతీయులు గర్విస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీ సహా ఆ చిత్ర యూనిట్ లు అభినందించడం విశేషం. అయితే తాజాగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఫార్ట్ ఫిల్మ్ పై కొన్ని పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈచిత్రంలో బొమ్మన్ మరియు బెల్లీ పాత్రలు పోషించిన ట్రైబల్ జంట ఇంత వరకు ఈ ఫార్ట్ ఫిల్మ్ ను చూడాలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈవిషయంపై తాజాగా దర్శకురాలు కార్తీకి స్పందించారు. తన ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు.
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను చూసిన మొట్టమొదటి ప్రేక్షకులు బొమ్మను మరియు బెల్లీనే అంటూ క్లారిటీ ఇచ్చింది. వారు అడవిలోని ప్రధాన ప్రాంతంలో నివసిస్తున్నారని, అక్కడ స్ట్రీమింగ్ ఛానెల్‌లకు ఏమాత్రం ఆస్కారం ఉండబోదన్నారు. దీంతో తానే స్వయంగా చూపించానని ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం బొమ్మను మరియు బెల్లీ తమిళనాడులోనే ఉంటున్నారు. బెల్లీకి ఫారెస్ట్ ఆఫీసులో ఉద్యోగం కూడా ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో బెల్లినే స్వయంగా తెలిపింది. ఈ చిత్రం తీసిన తర్వాత కేరళ, ఆయా ప్రాంతాల నుంచి ఏనుగు, తమను చూసేందుకు పిల్లలు వస్తున్నారని చెప్పుకొచ్చింది.
ఏదేమైనా కార్తీకి స్పందించడంతో ఆ రూమర్లకు అడ్డుకట్ట పడింది.
నిజ జీవితాల ఆధారంగా రూపొందించిన డాక్యూమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఎలాంటి పెద్దమొత్తంలో ప్రమోషన్స్ లేకుండా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆస్కార్ వేదికపై నిర్మాత గునీత్ మోంగాతో కలిసి కార్తీకి గోన్సాల్వేస్ అవార్డును స్వీకరించారు. ఈ చిత్రంలో గాయపడిన రఘు అనే అనాథ ఏనుగును బొమ్మన్ మరియు బెల్లీ ఎలా చూసుకున్నారు. దానిని తిరిగి ఆరోగ్యవంతంగా ఎలా చేశారన్నదే కథ. అద్భుతంగా చిత్రీకరించడంతో ఆస్కార్ వరకు వెళ్లింది.
తాజా సమాచారం ప్రకారం.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీలో కనిపించిన రెండు ఏనుగులు రఘు, ఆములు ప్రస్తుతం కనిపించకుండా పోయాయని తెలుస్తోంది. కొందరు దుండగులు మద్యం మత్తులో అడవిలోకి తరిమినట్టు ఉన్నారంటున్నారు. క్రిష్ణగిరి అడవుల్లోకి వెళ్లి ఉంటాయని.. వాటిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామని బొమ్మన్ తెలిపారు. ప్రస్తుతం ఇంకా గాలిస్తున్నారు.