Asianet News TeluguAsianet News Telugu

ది ఎలిఫెంట్ విస్పర్స్ డైరెక్టర్ కు స్టాలిన్ సత్కారం, అభినందించి, చెక్ అందించిన తమిళనాడు సీఎం

ఆస్కార్ సాధించినందుకు  ది ఎలిఫెంట్ విస్పర్స్ దర్శకురాలు కార్తీకిని సత్కరించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అంతే కాదు ఆమెకు భారీ ఎత్తున ఆర్థిక సాయం కూడా చేశారు ముఖ్యమంత్రి. 
 

The Elephant Whisperers Director Kartiki Gonsalves Felicitated By Tamil Nadu Cm Stalin
Author
First Published Mar 22, 2023, 3:35 PM IST

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విస్పర్స్ షార్ట్ మూవీ  95వ ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆస్కార్ సంబరాలు అయిపోయిన తరువాత విజేతలకు.. వరుసగా సత్కారాలు మొదలయ్యాయి. ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా దర్శకురాలు  కార్తికి గోన్సాల్వేస్ ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ని కలిసి ఆస్కార్ అవార్డుని చూపించింది. ఆయన వారిని ఘనంగా సత్కరించారు. 

వీరికి ఆస్కార్ వచ్చినప్పుడే సీఎం స్టాలిన్  వీరిని అభినందించారు. అందులోను తమిళనాడుకు చెందిన సినిమా కావడంతో ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా డైరెక్టర్, నిర్మాత తమిళ వాళ్ళు కావడంతో.. వీరికి కోటి రూపాయాలు ప్రకటించారు. ఇక తాజాగా ది ఎలిఫెంట్ విస్పర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ మంగళవారం సీఎం స్టాలిన్ ని కలవగా ఆయన సన్మానించి కోటి రూపాయల చెక్కుని అందచేశారు.

 

ఇక ఇప్పటికే ఈసినిమాలో నటించిన వారిని కూడా సత్కరించి.. ఆర్ధిక సాయం చేశారు స్థాలిన్. అలాగే సినిమాలో నటించిన నిజమైన ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లిలను కూడా సీఎం స్టాలిన్ సన్మానించారు. ఆ ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్ధికంగా కూడా నిధులు రిలీజ్ చేశారు స్టాలిన్. 

Follow Us:
Download App:
  • android
  • ios