టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’తో  దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ కాబోతుండటంతో కాస్తా ఆందోళన చెందుతున్నారు. 

యంగ్ హీరో నితిన్ - యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla Niyojakavargam). ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రోజు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. నితిన్ అభిమానులు, తెలుగు ఆడియెన్స్ కూడా మూవీ ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7:43 నిమిషాలకు ట్రైలర్ లాంచ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశారు.

నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతోనే డెబ్యూ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. గతంతో ఎన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్ గా వర్క్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. తొలిసారిగా నితిన్ ను డైరెక్ట్ చేసి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోనున్నారు. అయితే తాజాగా ట్రైలర్ పై స్పందిస్తూ.. కాస్తా ఆందోళనకు గురయ్యారు. ‘ఎడిటర్‌గా నేను చాలా ట్రైలర్స్ చేసాను. ఇప్పుడు నేను నా తొలి సినిమా #MacherlaNiyojakavargam ట్రైలర్ చేశాను. స్పందన కోసం ఎదురు చూస్తున్నాను.’ అంటూ ఇంట్రెస్టింగ్ గా పోస్ట్ పెట్టారు.

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నితిన్. చివరిగా ‘రంగ్ దే’, ‘మ్యాస్ట్రో’ సినిమాలతో మెప్పించి.. ప్రస్తుతం పక్కా కమర్షియల్ హిట్ కోసం ‘మాచర్ల నియోజకవర్గం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ తో అలరించనుంది. ఆగష్టు 12న సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Scroll to load tweet…