Asianet News TeluguAsianet News Telugu

బుజ్జి అండ్ భైరవ ట్రైలర్... యానిమేషన్ వెర్షన్ తో మరింత కన్ఫ్యూషన్! ఏం ప్లాన్ చేశావ్ నాగ్ మామా!

కల్కి చిత్ర విడుదల దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ జోరు పెంచారు. బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేషన్ వెర్షన్ క్రియేట్ చేసిన టీమ్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ విడుదల చేశారు. 
 

 the animation version of kalki 2829 ad watch bujji and bhairava trailer ksr
Author
First Published May 30, 2024, 6:50 PM IST

కల్కి 2829 AD  జూన్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. కేవలం ప్రమోషన్స్ కొరకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ఖర్చు రూ. 40 కోట్లు అని సమాచారం. ఇదే రేంజ్ లో మరో మూడు ఈవెంట్స్ ఇతర రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. 

కల్కి చిత్రం ప్రమోషన్స్ బుజ్జితో స్టార్ట్ చేశారు. కల్కి టీమ్ మొత్తం బుజ్జి నామ జపం చేస్తుంది. బుజ్జి ఫ్యూచరిస్టిక్ కారు కాగా... ప్రత్యేకంగా రూపొందించారు. ముందు రెండు, వెనక ఒక చక్రంతో విచిత్రంగా ఉన్న ఈ కారును రూపొందించేందుకు దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు పని చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సాంకేతిక సహకారం అందించారు. ఈ బుజ్జి కారును వివిధ నగరాలలో ప్రమోషన్స్ కొరకు తిప్పుతున్నారు. 

కల్కి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేషన్ వీడియో రూపొందించారు. ఈ వీడియో అమెజాన్ ప్రైమ్ లో మే 31 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. సదరు ట్రైలర్ లో బుజ్జి అండ్ భైరవ జర్నీ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు. వారిద్దరూ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ వలె ఉంటారని చెప్పకనే చెప్పారు. 

అసలు భైరవను వదిలేసి బుజ్జిని ఇంతగా ప్రమోట్ చేయడం వెనుక కారణం ఏమిటో అర్థం కావడం లేదు. కల్కి లో ప్రభాస్ పాత్ర భైరవ. ప్రభాస్ రోల్ కి కూడా అంత హైప్ ఇవ్వడం లేదు పీఆర్ టీమ్. వాళ్ళ ఫోకస్ మొత్తం బుజ్జి మీదే ఉంది. ఈ ప్రయోగం చాలా ప్రమాదం. తప్పుగా ఆడియెన్సులోకి వెళితే ఫలితమే దెబ్బతినే అవకాశం ఉంటుంది. 

కల్కి చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios