Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి బరిలో అజిత్ చిత్రం, తెలుగు రైట్స్ అంత తక్కువా?

‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్‌.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు.  

The Ajith Kumar-starrer Thunivu Telugu theatrical rights sold
Author
First Published Dec 6, 2022, 3:07 PM IST


కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ కు ఒక టైమ్ లో తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు ఇక్కడ ఆడకపోవటంతో బిజినెస్ బాగా తగ్గుతూ వచ్చింది. అయినా ఇక్కడ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అజిత్ కూడా తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టినట్లు లేదు. పూర్తిగా తమిళం వాళ్లకు నచ్చేలా ఆయన సినిమాలు ఉంటున్నాయి. ఇక్కడ రిలీజ్  ప్రమోషన్స్ కూడా రావటం లేదు. ఈ నేపధ్యంలో ఈ సంక్రాంతికి అజిత్  తాజా సినిమా ‘తునివు’రిలీజ్ కు రెడీ అవుతోంది. 

వినోద్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళంలో బాగా క్రేజ్ ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు సహా పలు భాషల్లో విడుదల కాబోతోంది.
 
  ఈ నేపథ్యంలో ‘తునివు’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. తెలుగులో తెగింపు అని టైటిల్ పెడుతున్నట్లు వినికిడి. ఇక  ఈ  సినిమాకు సంబంధించి  రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, IVY ప్రొడక్షన్స్ కలిసి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నాయి. అందుతున్న సమాచారం మేరకు కేవలం మూడు కోట్లకే ఈ చిత్రం తెలుగు రైట్స్ దొరికాయని తెలుస్తోంది. ఏ మాత్రం సినిమా బాగుండి వర్కవుట్ అయినా భారీ లాభాలు వచ్చే అవకాసం ఉంది. ఇక  ఈ మూవీ  తెలుగులో  బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, విజయ్ ‘వారసుడు’ సినిమాలతో పోటీకి దిగనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios