ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల మాత్రమే  కాక,సినిమా ప్రేమికుల అందరి దృష్టీ పుష్ప చిత్రం టీజర్ పై ఉంది.  అడవి బ్యాక్ డ్రాప్, ఎర్రచందనం కథంశంతో తెరకెక్కుతున్న పుష్ప మూవీ నుంచి ఇప్పటి వరకు పిక్స్ మాత్రమే వచ్చాయి.. రీసెంట్ గా చిన్న  వీడియో బిట్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్..  వెనక్కి విరిచి తాళ్లతో కట్టేయబడిన చేతులతో 'పుష్పరాజ్' పారిపోతూ తనని తరుముకొచ్చే వాళ్లు ఎంత దూరంలో ఉన్నారన్నది అంచనా వేస్తూ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పుష్ప ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు.దాంతో ఇప్పుడు అందరూ పుష్ప ఫేస్ ఎలా ఉంటుందో కాక, టీజర్ లో ఏం చూపెట్టబోతున్నారు..ఏ విధంగా డైలాగులు ఉండబోతున్నాయనే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే కావడం వలన, ఫ్యాన్స్ కోసం ముందురోజునే ట్రీట్ ఇస్తున్నారు చిత్రం యూనిట్. ఇక హీరోని ఎవరు ఎందుకు బంధించారు? అనే ఆసక్తిని ఈ వీడియో రేకెత్తిస్తోంది. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప రాజ్ ను పరిచయం చేస్తామని ఈ వీడియో చివర్లో చెప్పారు. అంటే ఆ రోజున మరో వీడియోను వదలనున్నారని తెలుస్తోంది. ఆ టీజర్ లో ఒకే ఒక డైలాగు ఉండబోతోందనే విషయం వైరల్ అవుతోంది. 

ఆ డైలాగు మరేదో కాదట..  గతంలో ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ పుష్ప చిత్రాంలోని ఓ డైలాగ్‌ను చెప్పుకొచ్చాడు.  ‘తగ్గేది లే’ అనే సింగిల్ డైలాగ్‌తో పుష్ప టీజర్‌ను చిత్ర యూనిట్ రెడీ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి ఈ టీజర్‌లో నిజంగా కేవలం ఒకే డైలాగ్ ఉంటుందా లేక మరిన్ని డైలాగులతో ఈ టీజర్‌ను నింపేస్తారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటికే  టీజర్ పని ప్రారంభమైంది. ఫైనల్ టీజర్ కోసం బన్నీ- సుకుమార్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల కరెక్షన్స్ తో అనేక వెర్షన్లు సిద్ధం చేశారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతోంది కాబట్టి.. ఇతర భాషల టీజర్లను ఒకేసారి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ టీజర్ లో ఫొటోగ్రఫీ హైలైట్ గా నిలవనుందనే విషయం మొన్న విడుదల చేసిన వీడియోలో ఉన్న ఒక్క షాట్ ను బట్టే తెలుస్తోంది.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మేకర్స్ ఎట్టిపరిస్థితిలో అనుకున్న తేదీని రిలీజ్ చేసే విధంగా  శరవేగంగా షూటింగ్ ముగించేయాలన్న తపనతో టీమ్ రౌండ్ ది క్లాక్ పని చేస్తోంది.   ఇక ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో బన్నీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.