అప్పుడే నడిచే పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎగిరిగంతేసేలా సాంగ్ ను ఇవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ ముందుంటాడు. ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్ లలో ఎదో ఒక సాంగ్ తప్పకుండా వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు మరోసారి మెగా హీరో రామ్ చరణ్ తో తస్సాదియ్యా అనిపించి అందరూ నోటా పడుకునేలా ఒక సాంగ్ వదిలారు. 

మెగా పవర్ స్టార్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాలోని మారో లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తస్సాదియ్యా అనే ఈ సాంగ్ ను శ్రీమణి రచించగా జస్ప్రీత్ తనదైన స్టైల్ లో ఆలపించారు. ఇంగ్లిష్ పదాలతో మొదలయ్యే ఈ పాటలో ప్రేమికులు ఎంజాయ్ చేయడం వంటి విషయాల టీజ్ చేస్తూ వివరిస్తున్నట్లు ఉంది. 

మొత్తంగా రామ్ చరణ్ స్టెప్పులు పాటలో హైలెట్ గా నిలుస్తాయట. కైరా అద్వానీ అంధ చందాలు కూడా పాటకు బూస్ట్ ఇస్తాయనిపిస్తోంది. పాట చిత్రీకరణ సమయంలో మెగాస్టార్ కూడా సెట్స్ కి వచ్చారు. ఇక ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి నిర్మాత దానయ్య ప్రయత్నాలు చేస్తున్నారు.