కొన్ని కథలు స్టోరీ లైన్ గా ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటాయి. దాన్ని ట్రీట్మెంట్ గా మార్చేటప్పుడు అసలు సమస్యలు వస్తాయి. ఫస్టాఫ్ సెట్ అయితే సెకండాఫ్ కుదరదు. మొత్తం బాగుంటే ఏ ఇంటర్వెలో లేక క్లైమాక్సో డల్ గా  ఉంటుంది. దాంతో ఆ ప్రాజెక్ట్ లు పట్టాలు ఎక్కటానికి చాలా టైమ్ తీసుకుంటాయి. ఇప్పుడు తరుణ్ భాస్కర్, వెంకటేష్ ప్రాజెక్టు కూడా అదే పరిస్దితి అంటున్నారు.

వాస్తవానికి తరుణ్ భాస్కర్ చెప్పిన స్టోరీ లైన్ ని నిర్మాత సురేష్ బాబు ఎప్పుడో ఓకే చేసారు. తన సోదరుడు వెంకటేష్ కు ఫెరఫెక్ట్ యాప్ట్ అనుకున్నారు. అయితే దాన్ని స్క్రిప్టు గా మార్చి వినిపించాక ఆయన సంతృప్తి చెందలేదట. ముఖ్యంగా సెకండాఫ్ కిక్ ఇవ్వలేదని అన్నారట. దాంతో ఇప్పటికి మూడు వెర్షన్స్ రాసి వినిపించారట తరుణ్ భాస్కర్. అయినా సరే ఓకే కాలేదట. దాంతో తరుణ్ భాస్కర్ టీమ్ ఈ ప్రాజెక్టుపై కుస్తీలు పడుతోందిట. మరో ప్రక్క తరుణ్ భాస్కర్ తను హీరోగా రూపొందుతోన్న చిత్రం ఫైనల్ అవుట్ ఫుట్ కు మార్పులు చేర్పులు ,డబ్బింగ్ పనుల్లో ఉన్నారట.

ఇక పెళ్లి చూపులు సినిమా తర్వాత హీరోగా విజయ్ దేవరకొండ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఆ సినిమాకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కూడా అంతే గుర్తింపు వచ్చింది. అయితే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తరుణ్ భాస్కర్ తన తరువాతి సినిమాలతో మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ తెచ్చుకుంది ... కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.దాంతో సురేష్ బాబు ఈ కొత్త ప్రాజెక్టు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్సై వెర్షన్స్ మీద వెర్షన్స్ రాయిస్తున్నారట.