ప్రస్తుతం తెలంగాణ యసను మిక్స్ చేసి ఊర మాస్ లో సినిమాలు చేస్తే జనాల్లో తెలియని ఎట్రాక్షన్ మొదలవుతుంది. పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి సినిమాల తరువాత ఒక సరికొత్త ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ని సెట్ చేసుకోగా ఇప్పుడు ఫలక్‌నుమా దాస్ కూడా అదే హీట్ ను పెంచుతోంది.

టీజర్ తో యూత్ లో భారీ అంచనాలను రేపిన విశ్వక్ సేన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో గాని విజయ్ దేవరకొండ స్టైల్ లో మాత్రం మనోడు కూడా ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇటీవల ఫలక్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విశ్వక్ ని విజయ్ తో పోల్చాడు. ఇద్దరు కూడా ఒకే తరహాలో సినిమాను లవ్ చేస్తారని వివరణ ఇచ్చాడు. 

ఈవెంట్ లో తెలంగాణ మాస్ యసలో విశ్వక్ మాట్లాడిన విధానం యూత్ ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ ప్రతిసారి అదే స్టైల్ లో జనాలను ఆకట్టుకుంటాడు. ఇప్పుడు విశ్వక్ కూడా మళ్లీ అదే దారిలో వెళుతున్నాడు. పైగా తన డైరెక్షన్ లోనే ఫలక్‌నుమా దాస్ ని తెరకెక్కించడం స్పెషల్ అని చెప్పవచ్చు. సినిమా ఏ మాత్రం క్లిక్కయిన విశ్వక్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఫలక్‌నుమా దాస్ ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా విశ్వక్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.