ఒక సినిమా షూటింగ్ మొదలుకాక ముందే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరోల  లుక్ ఒక్కటి ఎట్రాక్ట్ చేస్తే చాలు సినిమాకు క్రేజ్ చాలా ఈజీగా పెరిగిపోవడం పక్కా. ఇప్పుడు మోహన్ లాల్ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్టర్ ఒడియన్ అనే సినిమా చేస్తున్నాడు. 

ఆ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. పగలు రాత్రులలో విభిన్న స్వభావం కలిగిని వ్యక్తి చుట్టూ కథ తీరుగుతుందట. పురాతణకాలం నాటి కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దాదాపు 150కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యాలని మోహన్ లాల్ ప్లాన్ వేస్తున్నాడు. 

అయితే తెలుగులో ప్రమోషన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను ఇక తమిళ్ లో క్రేజ్ తెప్పించడానికి రజినీకాంత్ సహాయాన్నీ తీసుకుంటున్నట్లు టాక్. మోహన్ లాల్ కి రజినీకాంత్ కి మంచి స్నేహం ఉంది. ఇక తారక్ తో జనతా గ్యారేజ్ సినిమాలో నటించాడు కాబట్టి అప్పటి నుంచి మోహన్ లాల్ అంటే యంగ్ టైగర్ కి చాలా ఇష్టం. ఇక సినిమాలో ఇద్దరి స్టార్ హీరోల వాయిస్ ఓవర్ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 

రెండు భాషలకు తగ్గట్టుగా హీరోల క్రేజ్ ద్వారా ఒడియాన్ సినిమా మార్కెట్ ను పెంచాలని బాగానే ట్రై చేస్తున్నారు. ఇక డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా ఎంతవరకు విజయం అందుకుంటుందో చూడాలి.