పొలిటిషియ‌న్ కు ఆఫ‌ర్ ఇచ్చిన తాప్సి

thapsi bumper offer gives political leader
Highlights

  • బెంగుళూర్ లో  డిసెంబ‌ర్ 31 వేడుక‌ల్లో ఒక అమ్మాయిని ఏడిపించిన ఆక‌తాయిలు
  • అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకొవాడ‌మే కార‌ణం అని వాఖ్య‌లు చేసిన పొలిటిష‌న్ 
  • వివాదస్ప‌ద వాఖ్య‌లు చేసిన నాయ‌కుడికి  వార్నింగ్ ఇస్తు ఆఫ‌ర్ ఇచ్చిన తాప్సి 

 

.ఈ ఘటనపై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. 'స్త్రీల వస్త్రధారణతోనే సమస్యలు..' అంటూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో వివాదం ముదిరి పాకాన పడిందిప్పుడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే అబు అజ్మీ, మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్‌ తాప్సీ ఘాటుగా స్పందించింది.

 'ఇలాంటోళ్ళ మైండ్‌ సెట్‌ మారాలి.. అబు అజ్మీకి కావాలంటే నా సినిమాని ఫ్రీగా చూపిస్తా..' అంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించింది. అబు అజ్మీ కోసం 'పింక్‌' సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తా.. అదీ కాదంటే, ఆయనకు టిక్కెట్‌ నేను కొనిచ్చి 'పింక్‌' సినిమా చూపిస్తానంటూ తాప్సీ మండిపడింది. 

'పింక్‌' సినిమా లైంగిక వేధింపుల మీద తెరకెక్కించిన సినిమాయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అన్నట్టు అబు అజ్మీకి ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఇలాగే ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితుల్నీ శిక్షించాలని వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కారాయన. ఈ అబు అజ్మీ ఎవరో కాదు, తెలుగులో 'సూపర్‌' సినిమా గుర్తుందా.? అందులో అనుష్కతోపాటు మరో హీరోయిన్‌గా నటించిన అయేషా టకియా మామగారే

 

loader