సొట్ట బుగ్గల సుందరి తాప్సి నార్త్ లో రోజురోజుకి మరింత స్ట్రాంగ్ అవుతోంది. ఆనందో బ్రహ్మో అనంతరం బేబీ ఎక్కడ అడుగుపెట్టినా విజయాలు తలుపు తడుతున్నాయి. బాలీవుడ్ లో సైతం లేడి ఓరియెంటెడ్ సినిమాలను తీసే స్టేజ్ కి వచ్చేసింది. రీసెంట్ గా తాప్సి నుంచి వచ్చిన గేమ్ ఓవర్ సినిమా బాలీవుడ్ తో పాటు తెలుగు తమిళ్ లో కూడా రిలీజయింది. 

అయితే ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో నిర్మించి ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. సినిమా టీజర్ ట్రైలర్ కూడా ఓ వర్గం వారిని ఆకర్షించింది. దీంతో సినిమా 5 రోజుల్లోనే 7 కోట్లను కలెక్ట్ చేసింది. బడ్జెట్ తో పోలిస్తే ఈ కలెక్షన్స్ మంచి లాభమే అని తెలుస్తోంది. తాప్సితో ఇంకా ప్రయోగాత్మక సినిమాలు చేస్తే మరింత పెద్ద హిట్ అందుకోగలదని బాలీవుడ్ లో కూడా కథనాలు వెలువడుతున్నాయి. 

ఇక గేమ్ ఓవర్ సినిమా తెలుగులో 2 కోట్లను వసూలు చేసింది. మొత్తానికి తాప్సి బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాతో మంచి లాభాలనే అందించింది. ఇక డిజిటల్ రైట్స్ - శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా సినిమా నిర్మాతలకు బోనస్ లాభాలు బాగానే అందాయి.