Asianet News TeluguAsianet News Telugu

2 కోట్ల తో తీస్తే 50 కోట్లు తెచ్చిన సినిమా తెలుగులోకి

మనం ఇక్కడ అందరూ భారీ బడ్జెట్ చిత్రం సాహో గురించి మాట్లాడుతూంటే మళయాళంలో మాత్రం ఓ చిన్న బడ్జెట్ చిత్రం గురించే ప్రతీ చోట చర్చ జరుగుతోంది.  ఆ చిత్రం పేరు తన్నీర్ మధన్ దినంగల్ (పుచ్చకాయల రోజులు). ఆ సినిమా అక్కడ ఓ చరిత్ర క్రియేట్ చేసింది. కేవలం రెండు కోట్లతో తీసిన ఈ చిత్రం యాభై కోట్లు వసూలు చేసింది. 

Thanneermathan Dinangal hits the 50 crore mark
Author
Hyderabad, First Published Sep 3, 2019, 7:17 PM IST

మనం ఇక్కడ అందరూ భారీ బడ్జెట్ చిత్రం సాహో గురించి మాట్లాడుతూంటే మళయాళంలో మాత్రం ఓ చిన్న బడ్జెట్ చిత్రం గురించే ప్రతీ చోట చర్చ జరుగుతోంది.  ఆ చిత్రం పేరు తన్నీర్ మధన్ దినంగల్ (పుచ్చకాయల రోజులు). ఆ సినిమా అక్కడ ఓ చరిత్ర క్రియేట్ చేసింది. కేవలం రెండు కోట్లతో తీసిన ఈ చిత్రం యాభై కోట్లు వసూలు చేసింది. 

అదీ నలభై రోజుల్లో. అక్కడ మీడియా మొత్తం ఈ సర్పైజ్ హిట్ గురించే మాట్లాడుతోంది. స్కూల్ పిల్లలు ఇద్దరు లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా ఓ లవ్ స్టోరీ. కాలేజీ పిల్లలు, వాళ్ల కలలు, రొమాన్స్, కన్ఫూజన్స్ చుట్టూ తిరుగుతుంది. చూసిన ప్రతీ ఒక్కరు తమ టీనేజ్ లోకి వెళ్లిపోవటమే ఈ సినిమా సక్సెస్ కు కారణం. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు బేస్ గా నిలబెట్టాయి. 

అలాగే ఈ సినిమా అంతకు ముందు వచ్చి హిట్టైన ఇష్క్ ని సైతం దాటేసి మళయాళ ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. కొత్త తరహా కథ,కథనం మళయాళ మార్కెట్ ని సుసంపర్నం చేస్తున్నాయి. వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి సైతం రీమేక్ అవుతోందని సమాచారం. ఈ మేరకు పోటీపడి మరి రైట్స్ ని పొందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనూ ప్రసాద్ లో ఈ సినిమా రిలీజైతే వరసగా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మరి తెలుగులోనూ సరైన కాస్టింగ్ తో చేస్తే ఇక్కడా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉందని సినిమా జనం అంటున్నారు. ఇంతకీ తెలుగులో ఈ రైట్స్ ఎవరు తీసుకున్నారు..ఎవరితో చేస్తున్నారనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios