బాబుమోహన్ కోసం క్రిష్ణ గారితో పెద్ద గొడవ పెట్టుకున్న

Thammareddy reveals fight with super star krishna
Highlights

బాబుమోహన్ కోసం క్రిష్ణ గారితో పెద్ద గొడవ పెట్టుకున్న

దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి ఎంతో అనుభవం వుంది. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'రౌడీ అన్నయ్య' సినిమా సమయంలో సూపర్ స్టార్ కృష్ణతో జరిగిన గొడవను గురించి ప్రస్తావించారు.

"బాబూ మోహన్ తో చేసే ఆ సాంగ్ లో కృష్ణగారు కనిపించకూడదని నేను అంటాను. తాను కనిపించకపోతే ఎలా అంటారు ఆయన. దాంతో ఇటు కృష్ణగారితోను .. ఆయనకి తెలియకుండా అటు బాబుమోహన్ తోను సాంగ్ చేయడం జరిగింది. సెన్సార్ కి మాత్రం బాబుమోహన్ సాంగ్ ఉండేలా చూశాను. ఆ సాంగ్ పట్ల సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో కృష్ణగారు జోక్యం చేసుకోవడం .. సెన్సార్ ఆఫీస్ కి వెళ్లి ఆ సాంగ్ చూడటం జరిగిపోయింది. తన సాంగ్ కాకుండా బాబూమోహన్ సాంగ్ ఉండటం చూసి ఆయనకి కోపం వచ్చేసింది. నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ రోజుతో తమ ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పేసి వెళ్లిపోయారు" అంటూ చెప్పుకొచ్చారు .       

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader