Asianet News TeluguAsianet News Telugu

దేవుడి సినిమా ఫ్లాపైపోతుంటే భక్తులు ఏంచేశారు-తమ్మారెడ్డి

  • పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ పై తమ్మారెడ్డి కామెంట్స్
  • పవన్ ఫ్యాన్స్ అంతా ఫ్లాప్ అవుతుంటే ఏం చేశారని ప్రశ్న
  • దేవుడు అంటూ కొలిచే ఫ్యాన్స్ సినిమా ఎందుకు చూడలేదో...
thammareddy bharadwaja hot comments on pawan kalyan

తెలుగు హీరోల్లో  అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా మందికి అభిమానులున్నా పవన్ అభిమానులు వేరయా.. అన్నట్టుంటుంది పవన్ ఫ్యాన్స్ ప్రభంజనం. అయితే.. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' ఇటీవల విడుదలై పరాజయం మూటగట్టుకుంది. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 

‘పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘అజ్ఞాతవాసి' అంత డిజాస్టర్ సినిమా లేదు. గతంలో ‘జాని' ఉండేది. జానీ కంటే కూడా ఇది డిజాస్టర్ మూవీ. ఈ ప్రస్తావన తేవడానికి కారణం.. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ను దేవుడు అంటూ కొందరు తెగ ఆరాధిస్తున్నారు, ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే ఎదురు దాడి చేస్తున్నారు. ఎక్కడ ఏ హీరో ఆడియో ఫంక్షన్ జరిగినా పవనిజం జిందాబాద్ అంటూ గోల చేస్తున్నారు. ఇంతలా ఆయన్ను ఆరాధించే వారంతా సినిమా ప్లాప్ అవుతుంటే ఏమైపోయినట్లు?.... అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

 

‘అజ్ఞాతవాసి' తొలి రోజు నుండి కూడా సరిగా ఆడలేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అని చెప్పే మనుషులు ఏమైపోయినట్లు. పండగ సీజన్, హాలిడే సీజన్ అయినప్పటికీ సినిమాను హిట్ చేయలేక పోయారు. మరో పక్క పోటీలో బాలయ్య సినిమా. పవన్ కళ్యాణ్ సినిమాతో పోలిస్తే ఇది కాస్ట్ వైజ్, రెవెన్యూ వైజ్ వీక్ సినిమా. ఆ సినిమాతో పోటీ పడుతూ రెవెన్యూ రాలేదంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ప్లాపైంది ఆయన్ను ఏదో తక్కువ చేసి మాట్లాడటానికి ఇందంతా చెప్పడం లేదు, ఇంత జరుగుతుంటే అభిమానులంతా మిన్నకుండి పోవడం చాలా బాధ అనిపించింది' అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రజలను మోసం చేస్తున్నారా? మిస్ లీడ్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన రాజకీయం తీసుకొస్తాను అని చెప్పడంతో అంతా ఆయన్ను నమ్మాం. 2014 ఎలక్షన్లలో మోడీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో కొన్ని వాగ్దానాలు చేశారు. అప్పుడిచ్చిన వాగ్దానాల గురించి అడిగితే ముగ్గురూ మూడు మాటలు చెబుతున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజీ ఇస్తున్నారు కదా చాలు అంటారు. మరి ప్యాకేజీ ఏది? అంటే ఆయనే మళ్లీ రాలేదంటారు. బీజేపీ వారేమో ప్యాకేజీ ఇచ్చామని అంటారు. ఎప్పటికప్పుడు మాటలు దాటవేస్తూ పబ్బం గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో మనం ఆలోచిద్దాం, చెబుదాం అంటున్నారు. జగన్ గారు మీరు ప్యాకేజీ ఇస్తే మేము మీతో కలుస్తామని ఆయనొక స్టేట్మెంట్ ఇస్తారు. అంతా కలిసి ప్రజలను మోసం చేస్తున్నారా? మిస్ లీడ్ చేస్తున్నారా? అర్థం కాలేదు. అంటూ తమ్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

 

చంద్రబాబు నాయుడు, జగన్ రాజకీయ నాయకులు ఇలానే మాట్లాడుతారు అని పక్కన పెడుదాం. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్లతో కలిసి పోయారంటే ఆలోచించాల్సిన విషయం, ఆశ్చర్య పడాల్సిన విషయం. దీనిపై మనం ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెడతారు. నువ్వు ఎవడ్రా మాట్లాడటానికి అంటూ దుమ్ముత్తి పోస్తారు. వాళ్లు ఎందుకు మాట్లాడుతారో తెలియదు. అంటూ తమ్మారెడ్డి తన మనసులోని మాటను బయట పెట్టారు.

 

పవన్ కళ్యాణ్ గారైనా, ఆయన ఫ్యాన్స్ అయినా, నా లాంటి వారైనా మనం అంతా కోరేది ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు. రాష్ట్రానికి మంచి జరుగాలని. పవన్ కళ్యాణ్ గారు... మీరు నాయకులు అయ్యారు కాబట్టి మంచి కోసం మనం అంతా కలిసి ఏం చేయాలో చెప్పాలి. వారిద్దరూ రాజకీయ నాయకులు వారిని నమ్మలేము అనే సంగతి మీకు చెబుతున్నాం. మిమ్మల్ని నమ్ముదాం అనుకుంటున్నాం. మీరైనా సరిగా చెప్పండి. సరిగా గైడ్ చేయండి. మీరు కూడా మంచి గైడెన్స్ తీసుకుని చెబితే బావుంటుంది. ఏమీ లేకుండా ఊరికే గాలి పోగు చేసి అప్పటికప్పుడు వచ్చి ఏదో మాట్లాడేసి వెళితే సరిపోదు. మిమ్మల్ని ఏదైనా అంటే మీ ఫ్యాన్స్ వచ్చి తిడుతున్నారు. రాజకీయాలంటే క్లీన్ గా ఉండాలి క్లీన్ గా ముందుకు వెళ్లాలి. రాజకీయం అంటే ఒకరినొకరు తిట్టుకోవడం కాదు. పొగుడుకోవడం అంతకన్నా కాదు. మన ప్రజలకు మనం ఏం చేస్తాం, ఏం చేయగలం, ఏం చేస్తే బావుంటుంది అనేది ముఖ్యం. అని తమ్మారెడ్డి సూచించారు.

 

ఎప్పుడు మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్లి కనపడి స్టేజీ మీద మాట్లాడి ఆవేశంగా దిగిపోయి వెళ్లి పోవడం కాదు. మన రాష్ట్రానికి కావాల్సింది ఇది, మా పార్టీ కానీ, నేను కానీ ఇది చేస్తాం, మీరు కూడా ఇలా చేయండి, మన రాష్ట్రానికి బావుంటుంది, మన ప్రజలకు మంచిది అని చెప్పాల్సిన అవసరం ఉంది. అని తమ్మారెడ్డి సూచించారు.

సినిమా యాక్టర్లు ప్రతి వారు దేశాన్ని ఉద్దరిస్తారు, ఉద్దరించాలని ఎవరూ అనుకోవడం లేదు. నువ్వు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించడం లేదు. చేస్తాను మీరు వచ్చారు కాబట్టి అడుగుతున్నాం. మీరు మంచి చేస్తే మీ వెనకాల మేము ఉంటాం. కానీ చేస్తాను చేస్తాను అని ఊరికే ఆశ పెట్టొద్దు. నా చేతిలో చాక్లెట్ ఉంది మీకు ఇస్తాం అని కాకుండా మాకు ఇవ్వండి, ఇస్తే తింటాం. అనే రీతిలో రాజకీయం ఉండాలని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios