Asianet News TeluguAsianet News Telugu

తన సంపాదనపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 


రెండు దశాబ్దాల క్రితమే రోజుకు లక్ష రూపాయల వరకు థమన్ సంపాదించేవాడట. తాజాగా ఆయన ఒకప్పటి తన ఆర్జన మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

thamans opens up his remuneration way back in 2000 as keyboard player
Author
First Published Feb 2, 2023, 3:26 PM IST

థమన్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రధాన పోటీ దేవిశ్రీ-థమన్ మధ్య నడుస్తుంది. మూడేళ్ళుగా దేవిశ్రీ మీద థమన్ ది అప్పర్ హ్యాండ్ అయ్యింది. అల వైకుంఠపురంలో మూవీ ఆల్బమ్ తో ఆయన ఒక్కసారిగా రేసులో దూసుకొచ్చారు. దీంతో ప్రతి స్టార్ హీరో ఛాయిస్ థమన్ అయ్యారు. అరడజనుకు పైగా భారీ ప్రాజెక్ట్స్ తో థమన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎస్ఎస్ఎంబి 28, ఆర్సీ 15, పవన్ ఓజి తో పాటు పలు ప్రాజెక్ట్స్ కి ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. 

బాల్యం నుండి మ్యూజిక్ ఇండస్ట్రీలో థమన్ ఉన్నాడు. చిన్న వయసులోనే గొప్ప డ్రమ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ లో పనిచేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కావడం కోసం పలువురి వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు.థమన్ ఒకప్పటి మణిశర్మ శిష్యుడు కావడం విశేషం. దేవిశ్రీ కూడా మణిశర్మ అసిస్టెంట్ గా చేశారు.  2008లో విడుదలైన మళ్ళీ మళ్ళీ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం కిక్. ఆ చిత్రంలోని సాంగ్స్ కి భిన్నమైన ట్యూన్స్ ఇచ్చి థమన్ సంగీత ప్రియులను ఆకర్షించాడు. 

కాగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే లక్షల్లో సంపాదించేవాడినని చెప్పారు. 1999-2000 లలో థమన్ టాప్ కీబోర్డు ప్లేయర్ అట. రోజుకు ఆయన రూ. 70 నుండి 80 వేలు చార్జ్ చేసేవాడట. ఆ రేంజ్ లో తన సంపాదన ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాకు కోట్లలో ఛార్జ్ చేస్తున్నారు. థమన్ చాలా చిన్న స్థాయి నుండి ఎదిగారు. ఈ విషయాన్ని మణిశర్మ స్వయంగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios