సైరా లో మెరవనున్న అవంతిక

First Published 10, Apr 2018, 1:19 PM IST
Thamannah to join in sye raa shoot
Highlights
సైరా లో మెరవనున్న అవంతిక

తెలుగు .. తమిళ భాషల్లో తమన్నాకు విపరీతమైన క్రేజ్ వుంది. హిందీలోను ఆమెకి మంచి గుర్తింపు వుంది. ప్రస్తుతం ఆమె 'క్వీన్' రీమేక్ లోను .. కల్యాణ్ రామ్ జోడీగా 'నా నువ్వే' సినిమా చేస్తోంది. ఇక 'సైరా' సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను తమన్నా అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా మొదలైపోయాయని అంటున్నారు. నయనతారతో పాటు మరో కథానాయిక పాత్ర కావొచ్చని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.     

loader