పక్కలోకి పిలిచేవాళ్లు చాలామంది ఉన్నారు : తమన్నా

First Published 12, May 2018, 11:40 AM IST
Thamannah sensational comments on catingc ouch
Highlights

పక్కలోకి పిలిచేవాళ్లు చాలామంది ఉన్నారు : తమన్నా

హీరోయిన్ల‌ను క‌మిట్‌మెంట్ పేరుతో ప‌క్క‌లోకి ర‌మ్మ‌ని పిలిచే అల‌వాటు సినిమా రంగంలో ఉంద‌ని, అయితే ఈ స‌మ‌స్య కేవ‌లం ఒక్క టాలీవుడ్‌లో మాత్ర‌మే కాద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తీ సినిమా ఇండ‌స్ర్టీలోను ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. 

కాగా, ఇటీవ‌ల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిధిగా వ‌చ్చిన త‌మ‌న్నా కార్య‌క్ర‌మం అనంత‌రం మీడియాతో ముచ్చ‌టిస్తూ సినీ ఇండ‌స్ర్టీపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అయితే, త‌న‌ను మాత్రం ఎవ‌రూ ప‌క్క‌లోకి ర‌మ్మ‌ని అడ‌గ‌లేద‌ని చెప్పుకొచ్చింది త‌మ‌న్నా. అయితే, సినీ ఇండ‌స్ర్టీలో అలా అడిగే వారు ఉన్నార‌న్న‌ది నిజ‌మేన‌ని, కానీ కొత్త‌గా వ‌స్తున్న హీరోయిన్ల‌కు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అటువంటి వారు తార‌స‌ప‌డ‌గానే వెంట‌నే సినీ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయాల‌ని తెలిపింది.

loader