ఇటీవల అభినేత్రి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. F2 హిట్టవ్వడంతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కిందనుకున్న తమన్నా మళ్ళీ ప్లాప్ అందుకుంది. అవకాశాలు కూడా బాగానే వస్తుండడంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. 

అయితే అమ్మడు మరొక హారర్ రీమేక్ తో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆనందో బ్రహ్మో సినిమాతో హిట్ అందుకొని  బాలీవుడ్ లో తాప్సి బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కథలో మిల్కీ బ్యూటీ నటించేందుకు రెడీ అవుతోంది. 

తెలుగులో యాత్ర దర్శకుడు మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఆనందో బ్రహ్మ 2017లో రిలీజయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక ఇప్పుడు తమిళ్ లో అదే కథలో తమన్నా నటించనుంది. రోహిన్ వెంకటేశన్ ఈ హారర్ కామెడీ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడు.