సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman) బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ ను అందిస్తూ దుమ్ములేపుతున్నారు. తాజాగా ‘వారిసు’ చిత్రం చూస్తూ ఎమోషనల్ అయిన ఆయన కన్నీటి పర్యంతం అవడం నెట్టింట వైరల్ గా మారింది.  

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) - దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వారిసు’. బైలింగ్వుల్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ తమిళంలో జనవరి 11న విడుదలైంది. మంచి రెస్పాన్స్ తో థియేటర్లలో దుమ్ములేపుతోంది. ఇక తెలుగులో కాస్తా ఆలస్యంగా రానుంది. సంక్రాంతి రేసులో బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ఉండటంతో జనవరి 14న ఇక్కడ విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. 

వంశీపైడిపల్లి రచన, దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ కాబోతోంది. తెలుగులోనూ విజయ్ కు మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళంలో పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే, చెన్నైలోని ఓ ప్రముఖ థియేటర్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) కలిసి ‘వారిసు’ను చూశారు.

చిత్రంలో విజయ్ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, నటనలో తన బెస్ట్ అందించాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయంట. ఈ క్రమంలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన థమన్ సినిమా పూర్తయ్యే సరికి భావోద్వేగానికి గురయ్యారు. తన సంగీతానికి, సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిపై థమన్ ట్వీట్ కూడా చేశారు. ఇక థమన్ సంగీతం అందించిన ‘వీరసింహారెడ్డి’ తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపుతోంది. మరోవైపు ‘ఆర్సీ15’కి అదిరిపోయే మ్యూజిక్ అందించబోతున్నారు. 

ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ సరసన ఆడిపాడనుంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…