స్టార్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎన్నో హిట్స్ వచ్చాయి. అసలు అల్లు అర్జున్ సినిమా అనగానే మ్యూజిక్ డైరక్టర్ దేవినే అని ఫ్యాన్స్ ఫిక్సైపోతారు. కానీ ఇప్పుడు తమన్ సీన్ లోకి వచ్చారు. అందుకు కారణం ఏమిటి అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి ఏ మ్యూజిక్ డైరక్టర్ అయితే ఫెరఫెక్ట్ గా ఉంటారనే చర్చలు గత కొద్ది రోజులుగా మెగా క్యాంప్ లో జరుగుతున్నాయి. ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్ తో వెళ్లిపోదాం అనే ఆలోచన అల్లు అర్జున్ కు ఉంది...అయితే దర్శకుడుగా త్రివిక్రమ్ కు పూర్తి స్వేచ్చ ఉంది. ఈ నేపధ్యంలో తమిళ సంగీత దర్శకుడు  అనిరుధ్ రవిచందర్ తో వెళ్లిపోదామనుకున్నారు.

అల్లు అర్జున్ కూడా మీ ఇష్టం..పాటలు హిట్ అవటం ముఖ్యం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. దాంతో బన్ని ఏమంటాడో అని టెన్షన్ లో ఉన్న త్రివిక్రమ్ రిలీఫ్ అయ్యారట. అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ తో కలిసి పనిచేసారు  అనిరుధ్ రవిచందర్. సినిమా వర్కవుట్ కాకపోయినా పాటలు జనాల్లోకి బాగానే వెళ్ళాయి. సినిమా హిట్ అయితే పాటలు సూపర్ హిట్ అయ్యేవని త్రివిక్రమ్ ఆలోచన.

అయితే మెగా క్యాంప్ అనిరుధ్ రవిచందర్ కు ఓటు వెయ్యలేదట. మన తెలుగు నేటివిటి పాటలు ఇచ్చే సంగీత దర్శకుడుతో వెళ్దామని అన్నారట. దాంతో దేవినా, తమనా అనే డైలమోలో ఉన్నారట. చివరకు రీసెంట్ గా తమన్ తో అరవింద సమేతకు పనిచేయటంతో అటువైపే మ్రొగ్గుచూపాడట త్రివిక్రమ్. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ముఖ్య పాత్రల ఎంపిక జరుగుతోంది. సినిమాలో ప్రధానమైన హీరో తల్లి పాత్ర కోసం ఒకప్పటి హాట్ హీరోయిన్ నగ్మను త్రివిక్రమ్ ఎంపిక చేసుకున్నట్లు  సమాచారం.