Asianet News TeluguAsianet News Telugu

Akhanda:‘అఖండ’ ఇంటర్వెల్ బ్లాక్ కోసం అంత ఖర్చు? తమన్ రివీల్ చేసాడు

ఆ స్దాయిలో ఇంటర్వెల్ రావటానికి బోయపాటి,బాలయ్యతో పాటు తమన్ మ్యూజిక్ కూడా అదే విధంగా సాయిపడింది. ఇంటర్వెల్ చూసిన జనం ట్విట్టర్ వేదికగా  ‘మాస్ జాతర’, ‘నెక్ట్స్ లెవల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

Thaman Reveals Budget For Akhanda Interval Block
Author
Hyderabad, First Published Dec 9, 2021, 8:44 AM IST

 బాలకృష్ణ.. తాజాగా ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.  బొమ్మ పడిన బెనిఫిట్ షో నుంచే మాస్ హిట్ అని టాక్ వచ్చేసింది. బెనిఫిట్ షోలతో పాటు యూఎస్ షోలు పడ్డాయి. ఫ్యాన్స్ పూనకాలతో థియేటర్లలో ఊగిపోతున్నారు. బోయపాటి ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ అందించారని రెస్పాన్స్ చూస్తూనే తెలుస్తోంది.  ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కు అయితే జనం రెస్పాన్స్  మామూలుగా లేరు.అరుపులు, కేకలు తో ధియోటర్లు దద్దరిల్లుతున్నాయి. ఆ స్దాయిలో ఇంటర్వెల్ రావటానికి బోయపాటి,బాలయ్యతో పాటు తమన్ మ్యూజిక్ కూడా అదే విధంగా సాయిపడింది. ఇంటర్వెల్ చూసిన జనం ట్విట్టర్ వేదికగా  ‘మాస్ జాతర’, ‘నెక్ట్స్ లెవల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా ఈ  స్థాయి బ్లాక్ బాస్టర్ అవటానికి కారణమైన తమన్ ..ఇంట్రవెల్ కోసం ఎంత ఖర్చు పెట్టారో రివీల్ చేసారు.

అఖండ ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ కట్‌ను చూసిన తర్వాత థమన్ ఆ భాగానికి  ఓ రేంజిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంధించాలని నిర్మాతల చేత కాస్త ఎక్కువగానే ఖర్చు చేయించడట. ఆ 10 నిమిషాల ఎపిసోడ్‌ కోసమే థమన్ దాదాపు 20-30 లక్షల వరకు కోట్ చేశాడని అతనే చెప్తున్నారు. ఇందుకోసం థమన్ కేరళ నుండి ఒరిజినల్ చెండా వాయిద్యాలను (కేరళ తబల) మరియు దానిని వాయించే నిపుణులను రప్పించారు.  అఖండ ఇంటర్వెల్ బ్లాక్   BGM వాళ్ళు చేసారు. సౌండ్ మిక్సింగ్ పూర్తి చేయడానికి స్పెషలిస్ట్ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ షాదాబ్ రయీన్‌ని ముంబై నుండి హైదరాబాద్‌కు రప్పించారట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం థమన్ రూపొందించిన సంగీతం యొక్క మొదటి 3-4 వెర్షన్‌లతో అంతగా సంతృప్తి చెందలేదట. ఇక ఆ తర్వాత మరొక ఫైనల్ వెర్షన్‌ను రూపొందించగా సినిమాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది.

Also read 'అఖండ విజయోత్సవ జాతర' ఈ రాత్రికే, గెస్ట్ లు ఎవరంటే..

ఇక మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపింది. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ అయ్యింది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్స్‌.  

Also read Akhanda:‘అఖండ’కు సీక్వెల్‌ , అవన్నీ చూపిస్తారట,వాళ్లలో భయం
 

Follow Us:
Download App:
  • android
  • ios