Asianet News TeluguAsianet News Telugu

Akhanda:‘అఖండ’కు సీక్వెల్‌ , అవన్నీ చూపిస్తారట,వాళ్లలో భయం

ఈ సినిమా క్లైమాక్స్​లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో కీలక పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. 

Akhanda sequel in discussion?
Author
Hyderabad, First Published Dec 8, 2021, 7:55 AM IST

 

హిట్ సినిమాకు సీక్వెల్స్ లు, ప్రీక్వెల్స్ వస్తూండటం సహజమే. అయితే బాలకృష్ణ కెరీర్ లో ఎన్ని పెద్ద హిట్ లు వచ్చినా సీక్వెల్ లు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు ఆయన తాజా సూపర్ హిట్ అఖండకు వచ్చే అవకాసం ఉందని మీడియా వర్గాల్లో వినపడుతోంది.అందుకి తగ్గ క్లూ సినిమా చివరలో బోయపాటి ఇచ్చాడని చెప్తున్నారు. అదేంటో చూద్దాం.

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `అఖండ`. ఈ సినిమాపై తొలి నుంచే భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’తర్వాత ఈ హిట్‌ కాంబోలో హ్యట్రిక్‌ మూవీ కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘అఖండ’పై హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య గురువారం(డిసెంబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ప్రేక్షకులను మైమరిపించింది. సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. ఈ నేపధ్యంలో సినిమా సూపర్ హిట్టైంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కబుర్లు వినపడుతున్నాయి.

ఈ సినిమా క్లైమాక్స్​లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో కీలక పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. 'నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను' అని చెప్తాడు.   సీక్వెల్‌ని తెరకెక్కిస్తే ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం, అఖండ పునరాగమనం చేసే అవకాశం ఉందని ఫిలింనగర్‌ టాక్‌. సినీ వర్గాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. 

ఒకవేళ సీక్వెల్​ను తెరకెక్కిస్తే ఏమి అంశాలు ఉండవచ్చు అనే అంశం పైనే చర్చలు మొదలయ్యాయి. ఈ సీక్వెల్ సినిమాలో బాలకృష్ణ(అఘోర) నేపథ్యాన్ని చూపించొచ్చు. సినిమా ప్రారంభంలో పసిగుడ్డుగా ఉండగానే కాశీకి చేరతాడు బాలకృష్ణ. మరి అక్కడ ఎవరి దగ్గర, ఎలా పెరిగాడు? వంటి అంశాలను సీక్వెల్​లో చూపించే అవకాసం ఉందంటున్నారు. అలాగే ఈ మూవీలో బాలకృష్ణ(అఘోర) ఫ్లాష్​బ్యాక్​లో బాలయ్య  కొందురు దుర్మార్గులైన అఘోరాలను వెంటాడి మరీ చంపినట్లు చూపించారు. ఇందులో బాలయ్య(అఘోర) కర్తవ్యం పాడు బడిన గుడులను బాగుచేయడం.

Also read Akhanda:'అఖండ' పై బాలయ్య కుమార్తె బ్రాహ్మణి కామెంట్

ఆ ఆలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడం. మరి ఈ క్రమంలో అతడికి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అందుకే చెడ్డ అఘోరాలను చంపాడా? ఇవి కూడా సీక్వెల్​లో చూపించొచ్చని లెక్కలు వేస్తున్నారు. ఈ సీక్వెల్ ని కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు దింపుతారట. పొలిటికల్ సెటైర్స్ భీబత్సంగా ఉంటాయంటున్నారు. ప్రభుత్వ లోపాలపై దృష్టి పెడతారంటున్నారు.  ఇవన్నీ చూస్తూంటే...యాంటి ప్యాన్స్, టీడీపి వ్యతిరేక వర్గాల్లో లో భయం ప్రారంభమవుతోంది. ఎందుకంటే ఖచ్చితంగా అఖండ సీక్వెల్ కు భీబత్సమైన ఓపినింగ్స్ ఉంటాయి.

Also read Akhanda: ఎదిరించి నిలిచిన బాలయ్య...!

Follow Us:
Download App:
  • android
  • ios